ఆకట్టుకుంటున్న "రైట్ రైట్"
టైటిల్ : రైట్ రైట్ రేటింగ్: 2.5 తారాగణం : సుమంత్ ఆశ్విన్, పూజ జవేరి , నాజర్ , ప్రభాకర్, షకలక శంకర్, ధనరాజ్, రాజా రవీంద్ర తదితరులు సంగీతం : జేబి దర్శకత్వం : మను నిర్మాత : జే వంశీకృష్ణ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయితే సినిమాలు చూస్తూ పోతుంటే ఏదో […]
టైటిల్ : రైట్ రైట్
రేటింగ్: 2.5
తారాగణం : సుమంత్ ఆశ్విన్, పూజ జవేరి , నాజర్ , ప్రభాకర్, షకలక శంకర్, ధనరాజ్, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం : జేబి
దర్శకత్వం : మను
నిర్మాత : జే వంశీకృష్ణ
ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయితే సినిమాలు చూస్తూ పోతుంటే ఏదో ఒకరోజు మంచి హిట్ కొట్టక పోతామా అనే నమ్మకంతో తన జర్నీ పట్టుదలగా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈ రోజు విడుదలైన రైట్ రైట్ చిత్రం ఏ మేరకు అభిమానుల్ని మెప్పించిందో త్వరలో తెలుస్తుంది.
లవర్స్, కేరింత లాంటి సినిమాలతో యూత్ కు దగ్గరైన సుమంత్, ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘రైట్ రైట్’. పూర్తి పల్లె వాతావరణంలో తెరకెక్కిన రైట్ రైట్ సుమంత్ అశ్విన్ కెరీర్ కు స్పీడు పెంచిందో లేదో త్వరలో తేలుతుంది.
తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇ.రవి (సుమంత్ అశ్విన్). కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు రోజుకు ఒక్క ట్రిప్ మాత్రమే ఉండే గవిటి రూట్ అయితే బెటర్ అని రవికి అదే రూట్ డ్యూటీ వేస్తారు. వెళ్లే సమయమే కాని తిరిగి ఎప్పుడొస్తుందో చెప్పలేని గవిటి రూట్ బస్ డ్రైవర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్ లు ఊరి జనాలకు దగ్గరవుతారు. అదే బస్ లో రెగ్యులర్ గా వచ్చే కళ్యాణి(పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు.
రైట్ రైట్ చిత్రం 2012 సంవత్సరంలో మలయాళంలో ఆర్డనరి పేరు తో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం. వాస్తవ కథలా వుంటుంది. ఇది సుమంత్ లాంటి యంగ్ హీరోకు అయితే బావుంటుందనే నమ్మకంతో తెలుగులో రైట్ రైట్ పేరుతో చేసినట్లు స్పష్టం అవుతుంది. కథ స్వభావం రియలిస్టిక్ గా వున్నప్పుడు , స్క్రీన్ ప్లే టైట్ గా ఉండేలా చూసుకోవాలి. ప్రథమార్ధం ఎంటర్ టైనింగ్..సెకండాఫ్ క్రైమ్ యాంగిల్ జోడించినప్పుడు.. స్క్రీన్ ప్లే ఇరగదీసేయాలి. కానీ రైట్ రైట్ సినిమాకు తెలుగు లో రీమేక్ చేసిన మను పెద్దగా కష్టపడకుండా మలయాళంలో వున్నది వున్నట్లు మక్కీ మక్కీ కి అన్నట్లు దించేశారనిపిస్తోంది. హీరో యిజం ఎలివేట్ అయ్యే ఒక్క సన్నివేశం కూడా లేక పోవడం మైనస్. అలాగే కథలో హీరో ప్రేమ ముదిరి పాకన పడటానికి కావాలసినంత సెటప్ కథ పరంగా దర్శకుడు డిజైన్ చేసుకోకపోవడం మరో మైనస్. అయితే సినిమా రోడ్ మూవీ కావడం కొంత వరకు కలిసొచ్చింది. బసు జర్నీ సాగిపోతుంటుంది. అరకు అందాలు ..పచ్చదనం.. మంచు.. చిక్కని సాయంత్రాలు ఆడియన్స్కు పెద్దగా బోర్ కొట్టనివ్వవు.
ఇప్పటి వరకు అల్లరి పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారిగా ఓ బరువైన పాత్రను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.. డ్రైవర్ శేషుగా ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోయిన్ పాత్రలో పూజ ఆకట్టుకుంది. పల్లె వాతావరణంలో సాగే లవ్ స్టోరికి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి దర్శకుడు మను చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. కథనం లో మరింత వేగం చూపించాల్సింది.
ఆర్టిస్ట్ ల పనితీరు.
కథంతా విశ్వనాథం మాష్టారి కుటుంబం చుట్టూ నడుస్తుంది. రిటైర్డ్ హెడ్మాష్టర్ విశ్వనాథం రోల్ లో నాజర్ బాగా చేశారు. ఇక రవి అనే బసు కండక్టర్ గా .. తన వయసుకు తగ్గ రోల్ కావడంతో సుమంత్ అశ్విన్ అలవోకగా చేశాడు. సెకాండాఫ్ లో ఎమోషన్ సీన్స్ లో కూడా పరవాలేదనిపించాడు. ఇక బస్సు డ్రైవర్ శేషుగా ప్రభాకర్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడంలో కొంత ఇబ్బంది పడ్డాడనిపిస్తుంది. సహజ సిద్దంగా అనిపించదు. పంటి కింద రాయి పడినట్లు అనిపిస్తుంటుంది. ఇక డ్రామారావు గా షకలక శంకర్.. సింహాద్రి గా ధనరాజ్ లు ప్రథమార్ధం నవ్వులు పూయించారు. కొత్తమ్మాయి పూజ జవేరి కి పాత్ర పరంగా పెద్ద స్కోప్ లేదు. ఉన్నంత వరకు ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన ముఖ్య మైన రోల్ అంటే భద్ర రోల్ చేసిన కుర్రాడు. అమృతను ఇష్టపడే ఒక అతి ప్రేమికుడిగా బాగా చేశాడు.
మిగిలిన రోల్స్ అన్ని పరధి మేరకు ఓకే అనిపించారు. సినిమాకు పాటలు ప్లస్ అని చెప్పుకోవాలి. కథ సగటుగా ఉండటంతో.. పాటలు చాల వరకు కవర్ చేశాయి. ప్లేస్ మెంట్ కూడా బావుంది. అలాగే సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్ .. అయితే రీమేక్ అయినప్పటికి.. కథనం విషయంలో మరింత గా దర్శకుడు వర్క్ చేసి వున్నట్లయితే రైట్ రైట్ చిత్రం ఆడియన్స్ కు మరింతగా చేరువయ్యేది. ఓవరాల్ గా రైట్ రైట్ చిత్రం టైటిల్ కు తగ్గట్టు ఉంది. ఒకసారి చోడొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ మూవీ.