డివోర్స్‌ తీసుకున్నఅమ్మాయిలకు ఆ ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో!

సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం వృథా, యూజ్డ్‌' ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదన్న సమంత

Advertisement
Update:2024-11-26 09:50 IST

విడాకులు, మయోసైటిస్‌.. ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులపై సమంత సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ సమంత స్పందించారు. మహిళలు ఎదుర్కొనే సామాజిక సవాళ్ల గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారని అన్నారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.

విడాకుల గురించి సమంత మాట్లాడుతూ.. డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తుంది. సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం వృథా, యూజ్డ్‌' ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని

ఇవి ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయిని ఇవి మరింత నిరాశపరుస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలని అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులు ఎంతోమంది మద్దతుగా నిలిచారంటూ వారికి ధన్యవాదాలు చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News