ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు

మూవీ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. తమిళ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది

Advertisement
Update:2024-11-27 20:39 IST

తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వీరు డివోర్స్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని గత వారం కోర్టు విచారణలో తెలిపారు.ఈ మేరకు కీలక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలోనే ధనుష్ అలాగే ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకున్నారు. ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ మొత్తం చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే గత వారంలో వీరిద్దరి కేసును చెన్నై ఫ్యామిలీ కోర్టు విచారణ చేసింది. మేము ఇద్దరం కలిసి ఉండేందుకు ఇష్టంగా లేమని గతవారం చెన్నై ఫ్యామిలీ కోర్టు ముందు ఐశ్వర్య, ధనుష్ చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే తమిళ హీరో ధనుష్, అలాగే ఐశ్వర్య కు విడాకులు ఇస్తున్నట్లు చెన్నై ఫ్యామిలీ కోర్టు ప్రకటన చేసింది.

Tags:    
Advertisement

Similar News