కీర్తి సురేశ్‌ కాబోయే వరుడు అతనే

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఇన్‌స్టాలో పంచుకున్నకీర్తి సురేశ్‌

Advertisement
Update:2024-11-27 12:27 IST

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నటి కీర్తి సురేశ్‌ కీలక ప్రకటన చేశారు. ఆంటోనీతో దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నదని తెలిపింది.

కీర్తి సురేష్ తన హైస్కూల్ ఫ్రెండ్‌ ఆంటోనీ తటిల్‌ ను డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. వారి వివాహం గోవాలో జరుగుతుందని, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పెళ్లి గురించి గతంలో ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. ఓసారి కమిడియన్‌తో లవ్‌ అని, మరోసారి మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ అని పుకార్లు వినిపించాయి. కానీ కీర్తి సైడ్‌ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. ఇటీవల కీర్తి సురేశ్‌ పెళ్లి అంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే మళ్లీ రూమర్సే అనుకున్నారు. కానీ ఈసారి కీర్తి సురేశ్‌ పెళ్లి వార్తలు నిజమేనని కోలీవుడ్‌ అన్నది. తన చిరకాల మిత్రుడు ఆంటోని తటిల్‌ పెళ్లాడబోతున్నది. కీర్తి-ఆంటోని గత పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నారట. ఫైనల్‌గా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కీర్తి తన రిలేషన్‌ షిప్‌పై దీనికి సంబంధించి ఇన్‌స్టాలో అధికారికంగా ఒక అందమైన పోస్ట్‌తో చేసింది.

Tags:    
Advertisement

Similar News