తెరపైన కనిపించకుండా చేయాలనుకున్నారు " సాక్షికి కృతజ్ఞతలు

నారా లోకేష్‌ బాధితుల్లో ఒకరైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి టీవీలో చేరారు. ఈ సందర్భంగా తనకు ఇటీవల జరిగిన అన్యాయాన్ని వివరించుకున్నారు. ఎన్టీవీలో పనిచేస్తూ ఉదయం లైవ్‌ షోతో జనంలో గుర్తింపు తెచ్చుకున్న కొమ్మినేని …ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఛానల్‌ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొమ్మినేనిని తెర మీద నుంచి తప్పించారు. తాను ఎక్కడా కూడా తెరమీద కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సాక్షిలో చేరిన సందర్భంగా కొమ్మినేని […]

Advertisement
Update:2016-06-10 12:20 IST

నారా లోకేష్‌ బాధితుల్లో ఒకరైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి టీవీలో చేరారు. ఈ సందర్భంగా తనకు ఇటీవల జరిగిన అన్యాయాన్ని వివరించుకున్నారు. ఎన్టీవీలో పనిచేస్తూ ఉదయం లైవ్‌ షోతో జనంలో గుర్తింపు తెచ్చుకున్న కొమ్మినేని …ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఛానల్‌ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొమ్మినేనిని తెర మీద నుంచి తప్పించారు. తాను ఎక్కడా కూడా తెరమీద కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సాక్షిలో చేరిన సందర్భంగా కొమ్మినేని చెప్పారు.

పరోక్షంగా ఇతర ఛానళ్లలో కూడా తనకు అవకాశం రాకుండా లోకేష్ అండ్ టీం అడ్డుకుందని చెప్పారు. సాక్షి యాజమాన్యం తనకు తెరపై కనిపించే అవకాశం ఇవ్వడమే కాకుండా… కేఎస్‌ఆర్ లైవ్‌ షో నిర్వహించే అవకాశం కూడా ఇచ్చిందని అందుకు కృతజ్ఞతలు అని కొమ్మినేని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై మూడు నెలలుగా చాలా మంది సంఘీభావం తెలిపారని కొమ్మినేని వివరించారు. కొందరు తన ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారని వెల్లడించారు. ప్రజలు భజన కోరుకోరని… తమ పక్షాన ప్రశ్నించాలని కోరుకుంటారని కొమ్మినేని అన్నారు. మొత్తం మీద సాక్షిలో చేరిన కొమ్మినేని మునుముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News