కడపలో ఏముంది ?-15 మంది ఐపీఎస్‌లు,5వేల మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలు

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం మహాసంకల్పదీక్ష సభను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలుత ఒంగోలులో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే తర్వాత సభను కడపకు మార్చారు. హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన చంద్రబాబుకు చెప్పులు చూపాలని జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పట్టింపుగా కడపలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ సొంత జిల్లాలోనే సభ నిర్వహించి ప్రతిపక్షానికి ప్రతిసవాల్ విసరాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ నేతలు భారీగా జనాన్ని తరలించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. […]

Advertisement
Update:2016-06-08 04:22 IST

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం మహాసంకల్పదీక్ష సభను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలుత ఒంగోలులో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే తర్వాత సభను కడపకు మార్చారు. హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన చంద్రబాబుకు చెప్పులు చూపాలని జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పట్టింపుగా కడపలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ సొంత జిల్లాలోనే సభ నిర్వహించి ప్రతిపక్షానికి ప్రతిసవాల్ విసరాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ నేతలు భారీగా జనాన్ని తరలించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కడప సభకు చంద్రబాబు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఏకంగా 5000 మంది పోలీసులను సభ వద్ద మోహరిస్తున్నారు. భద్రత పర్యవేక్షణకు 15 మంది ఐపీఎస్‌లను రంగంలోకి దింపారు. చీమచిట్టుకుమన్నా రికార్డు అయ్యేలా 400 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నారు. కడప జిల్లాలోనూ తన పాలనకు ఆమోదం ఉందని చెబుతున్న చంద్రబాబు మరీ ఇంతగా భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏముందని కడపజిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు.

బహుశా జగన్ సొంత జిల్లాకావడం, చెప్పులు, చీపుర్ల పిలుపు నేపథ్యంలోనే ఇలా ముందస్తు చర్యలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. రాయలసీమ ఉద్యమ నేతలకు కూడా పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు. రాయలసీమకు ఏం చేశారని కడపలో సభ పెడుతున్నారని కడప జిల్లా సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ ప్రశ్నించారు. కడపలో చంద్రబాబు సభను నిరసిస్తున్నామని ఏఐవైఎఫ్ నేత మద్దిలేటి చెప్పారు. రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరోవైపు కడప వేదికగా సంబరాలకు చంద్రబాబు సిద్దపడడం దారుణమని వైసీపీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News