కోదండ‌రాంపై మిశ్ర‌మ స్పంద‌న‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మైన జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌ తిరుగుబాటుపై రాష్ట్రంలో మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. ప్ర‌జాస‌మ‌స్య‌ల కోసం గొంతెత్తితే త‌ప్పేముందంటూ కొంద‌రు స‌మ‌ర్థిస్తున్నారు. కోదండ‌రామ్ ను స‌మ‌ర్థించే వారిలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ బాధితులు, కాంగ్రెస్-టీడీపీ కార్య‌క‌ర్త‌లు, వామపక్షాలు, తెలంగాణ ఉద్యమ నేత‌లు మాత్ర‌మే ఉండ‌టం ఇక్కడ గ‌మ‌నార్హం. ఇక‌పోతే.. నిన్న‌టి మొన్న‌టి దాకా తెర‌మ‌రుగైన‌, క‌నుమ‌రుగైన నేత‌లు కూడా కోదండ‌రామ్‌కు మ‌ద్ద‌తుగా వ‌స్తుండ‌టం విశేషం. కోదండ‌రామ్‌కు ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్ద‌తు అంతంత మాత్ర‌మే అయినా.. […]

Advertisement
Update:2016-06-08 02:30 IST
తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మైన జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌ తిరుగుబాటుపై రాష్ట్రంలో మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. ప్ర‌జాస‌మ‌స్య‌ల కోసం గొంతెత్తితే త‌ప్పేముందంటూ కొంద‌రు స‌మ‌ర్థిస్తున్నారు. కోదండ‌రామ్ ను స‌మ‌ర్థించే వారిలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ బాధితులు, కాంగ్రెస్-టీడీపీ కార్య‌క‌ర్త‌లు, వామపక్షాలు, తెలంగాణ ఉద్యమ నేత‌లు మాత్ర‌మే ఉండ‌టం ఇక్కడ గ‌మ‌నార్హం. ఇక‌పోతే.. నిన్న‌టి మొన్న‌టి దాకా తెర‌మ‌రుగైన‌, క‌నుమ‌రుగైన నేత‌లు కూడా కోదండ‌రామ్‌కు మ‌ద్ద‌తుగా వ‌స్తుండ‌టం విశేషం. కోదండ‌రామ్‌కు ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్ద‌తు అంతంత మాత్ర‌మే అయినా.. ఆయ‌న ఈ మ‌ద్ద‌తును క్ర‌మంగా పెంచుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ప్ర‌భుత్వం ఆందోళ‌న కూడా ఇదే కావ‌డం విశేషం.
ప్ర‌భుత్వం ఏమంటోంది..?
తెలంగాణ ఆవిర్భావం త‌రువాత జేఏసీ అవ‌స‌రం లేద‌ని కేసీఆర్ భావించారు. కోదండ‌రామ్ మాత్రం తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ‌లు నెర‌వేరే దాకా జేఏసీ ఉనికిలోనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఉప‌ద్ర‌వాన్ని కేసీఆర్ ఊహించారు. అందుకే ముందుజాగ్ర‌త్త‌గా త‌మ అనుబంధ విద్యార్థి నాయ‌కులు, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను జేఏసీ నుంచి త‌ప్పించారు. అయినా, జేఏసీ ఒంటిరిగానే ముందుకు సాగింది. రెండేళ్ల కాలంలో ఏనాడూ ప్ర‌భుత్వాన్ని నేరుగా విమ‌ర్శించ‌లేదు. ఉద్యోగుల విభ‌జ‌న‌, ముంపు మండ‌లాలు, హైకోర్టు విభ‌జ‌న‌, ఓటుకునోటు కేసు, కృష్ణా జ‌లాల వివాదం, తెలంగాణ ప్రాజెక్టులు ఇలా తెలంగాణ ప్ర‌భుత్వం ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. వీటిపై ఇంకా తెలంగాణ స‌ర్కారు పోరాడుతూనే ఉంది. ఈ విష‌యంలో కోదండ‌రామ్ ఏనాడూ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేదు. కానీ, ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను ప్ర‌శంసించారు.
దుష్ట‌శ‌క్తులు పొంచి ఉన్నాయి జాగ్ర‌త్త అని హెచ్చ‌రించారు. కానీ, ఇటీవల కాలంలో కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఆయన విమర్శిస్తున్నారు.ఇక రాష్ట్రంలో తనకు ఎదురేలేదనుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని కోదండరాం తప్పుబడుతున్నారు. కోదండరాం విమర్శలను కేసీఆర్ పట్టించుకోకపోగా తెలంగాణ ద్రోహులకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేయడాన్ని జీర్ణించుకోలేని కోదండరాం మీకు పాలించడం చేతరాకపోతే దిగిపోండి అని అక‌స్మాత్తుగా ప్ర‌క‌ట‌న చేసి అధికార పార్టీకి విరోధిగా మారారు. ఈ మాట ఎవ‌ర‌న్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకునేది కాదు.. అన్న‌ది కోదండ‌రామ్ కాబ‌ట్టే.. వారికి అరికాలి మంట నెత్తికెక్కింది. జేఏసీ ఏర్పాటు చేసిందే మేము.. కోదండ‌రామ్ ను చైర్మ‌న్‌గా చేసిందే మేము.. మేం నాటిన మొక్క మాకు ఎలా ఎదురు తిరుగుతుంది? అని మండిప‌డుతున్నారు.
Tags:    
Advertisement

Similar News