స్టేషన్‌లో ముద్రగడ...అమలాపురంలో ఉద్రిక్తత

తుని ఘటనకు బాధ్యులను చేస్తూ కాపు యువకులను అరెస్ట్‌ చేయడంపై మరోసారి అలజడి రేగింది. కాపుల అరెస్ట్‌ను నిరసిస్తూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అమలాపురం పీఎస్‌లో బైఠాయించారు. తనను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. తుని సభలో పరిణామాలకు పూర్తి బాధ్యత తనదేనని తొలుత తననే అరెస్ట్ చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. అమాయకులైన కాపు యువకులపై కక్ష సాధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముద్రగడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విషయం తెలుసుకున్న కాపులు […]

Advertisement
Update:2016-06-07 04:59 IST

తుని ఘటనకు బాధ్యులను చేస్తూ కాపు యువకులను అరెస్ట్‌ చేయడంపై మరోసారి అలజడి రేగింది. కాపుల అరెస్ట్‌ను నిరసిస్తూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అమలాపురం పీఎస్‌లో బైఠాయించారు. తనను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. తుని సభలో పరిణామాలకు పూర్తి బాధ్యత తనదేనని తొలుత తననే అరెస్ట్ చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. అమాయకులైన కాపు యువకులపై కక్ష సాధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముద్రగడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విషయం తెలుసుకున్న కాపులు పెద్దెత్తున అక్కడికి వస్తున్నారు. ముద్రగడతో పాటు తమను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అమలాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. ముద్రగడ నుంచి ఊహించని పరిణామం ఎదురవడంతో స్థానిక పోలీసులు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమిస్తామని ఇటీవల ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి పలువురు కాపులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News