తెలంగాణలో మరో ఉప ఎన్నిక?
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారులో చేరడం దాదాపుగా ఖాయమైంది. అయితే, ఆయన పార్టీలో చేరే ముందు తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. అంటే.. తెలంగాణలో మరోసారి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలి. గుత్తా రాజీనామా చేయడం.. దాన్ని సుమిత్రా మహాజన్ ఆమోదించాలి. తరువాత ఎన్నికల సంఘం.. రాజీనామా చేసిన […]
Advertisement
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారులో చేరడం దాదాపుగా ఖాయమైంది. అయితే, ఆయన పార్టీలో చేరే ముందు తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. అంటే.. తెలంగాణలో మరోసారి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలి. గుత్తా రాజీనామా చేయడం.. దాన్ని సుమిత్రా మహాజన్ ఆమోదించాలి. తరువాత ఎన్నికల సంఘం.. రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. కాస్త..అటూ ఇటూగా.. 2016 చివరినాటికి నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమన్న సంగతి వాస్తవం. ఇదే గనక నిజమైతే.. తెలంగాణలో రెండున్నరేళ్ల వ్యవధిలో మూడవ ఉప ఎన్నిక జరగనుందన్నమాట.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతవరకూ.. రెండు ఎంపీ స్థానాలకు, రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. వీటిలో రెండు పార్లమెంటు స్థానాలు టీఆర్ ఎస్ అభ్యర్థులే రాజీనామాలు చేసి వారి పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే.. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి లు అకాల మరణంచెందారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలే..! ఈ రెండుస్థానాలనూ టీఆర్ ఎస్ ఖాతాలో చేరాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. అది తెలంగాణ రాష్ట్ర సమితికే లాభిస్తోందన్నది తెలిసిన విషయమే!
నల్లగొండ ఎవరికి?
నల్లగొండ ఎంపీ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే.. ఉప ఎన్నిక వస్తే.. ఈసారి దాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి అభ్యర్థులు దొరకడం గగనమే! ఇక కాంగ్రెస్‌లో అభ్యర్థులుపుష్కలంగా ఉన్నా.. పోటీకి ఎందరు ముందుకు వస్తారు? వారిలో ఎవరిని అధిష్టానం ఎంపిక చేస్తుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే! ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలను పొగొట్టుకుంది. తాజాగా మరో ఎంపీ స్థానం చేజారే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి దీన్నయినా ఒడిసి పడుతుందా.. ప్రత్యర్థుల చేతిలో పెడుతుందా? అన్నది వేచి చూడాలి.
Advertisement