డీఎస్ కుర్చీ... గుత్తాకే!
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రేపో మాపో కారెక్కనున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గుత్తా పార్టీలోకి వచ్చేటపుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తాడన్న వార్తలూ వస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఒకవేళ గుత్తా చేరిక వాస్తవరూపం దాలిస్తే.. ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఆయనకు ఏం పదవి ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో డీఎస్ వదిలేసిన పోస్టు తెరపైకి వచ్చింది. ఇటీవల రాజ్యసభకు […]
Advertisement
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రేపో మాపో కారెక్కనున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గుత్తా పార్టీలోకి వచ్చేటపుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తాడన్న వార్తలూ వస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఒకవేళ గుత్తా చేరిక వాస్తవరూపం దాలిస్తే.. ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఆయనకు ఏం పదవి ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో డీఎస్ వదిలేసిన పోస్టు తెరపైకి వచ్చింది. ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా టీఆర్ ఎస్ నుంచి ఎంపికయ్యారు డీఎస్. అంతకుముందు ప్రభుత్వ సలహాదారుగా, కేబినెట్ హోదాలో కొనసాగిన డీఎస్ రాజ్యసభకు ఎంపికవ్వడంతో.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొన్నటి దాకా డీఎస్ రాజీనామా చేసిన పదవిని ఎవరికి కేటాయిస్తారన్న ప్రశ్నకు గుత్తా చేరికతో సమాధానం దొరికనట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుత్తాకు 2018లో రాజ్యసభ సీటు లేదా ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతవారం డీఎస్ రాజీనామా చేసిన సీటులో గుత్తాను కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
నాడు ఇదే పదవిపై న్యాయపోరు!
రాజకీయాల్లో జరిగే విచిత్రాలకు గుత్తా చేరిక చక్కటి ఉదాహరణ. గతేడాది కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీఎస్ టీఆర్ ఎస్‌లో చేరారు. ఆయనకు ఆఘమేఘాల మీద ప్రభుత్వ సలహాదారు పోస్టు కట్టబెట్టారు కేసీఆర్. దీనిపై అప్పుడు గుత్తా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు పార్లమెంటు కార్యదర్శుల నియామకాలను సవాలు చేస్తూ.. కోర్టును ఆశ్రయించారు. ఆ విషయంలో కోర్టు గుత్తాకే మద్దుతుగా నిలిచింది. దీంతో వాటి నియామకాలు రద్దయ్యాయి. మరోసారి ప్రభుత్వ సలహదారుల పోస్టులపై కూడా కోర్టును ఆశ్రయిద్దామని..అనుకున్నా ఎందుకో వెనక్కి తగ్గారు. విచిత్రంగా ఇప్పుడు అతనికి, అదే ప్రభుత్వం అదే పోస్టును కట్టబెడుతుందని ప్రచారం జరగడం నిజంగా విచిత్రమే!
Advertisement