తెలంగాణలో 2017లోనే మధ్యంతరమా?
తెలంగాణలో వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు వస్తాయంట. ఈ విషయం కేసీఆర్ తన చేతల ద్వారా పరోక్షంగా చెబుతున్నారంట నమ్మేందుకు కొంచెం వింతగా ఉన్నా.. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు ఇవి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నారో.. లేదా పత్రికల్లో పతాక శీర్షికన నిలవాలనుకున్నారో తెలియదు. ఏకంగా ప్రభుత్వం 2017లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతుందని ఆయన జోస్యం చెప్పేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 2019లోగా అమలు చేయలేమన్న విషయం సీఎం కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అందుకే, మధ్యంతర […]
Advertisement
తెలంగాణలో వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు వస్తాయంట. ఈ విషయం కేసీఆర్ తన చేతల ద్వారా పరోక్షంగా చెబుతున్నారంట నమ్మేందుకు కొంచెం వింతగా ఉన్నా.. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు ఇవి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నారో.. లేదా పత్రికల్లో పతాక శీర్షికన నిలవాలనుకున్నారో తెలియదు. ఏకంగా ప్రభుత్వం 2017లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతుందని ఆయన జోస్యం చెప్పేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 2019లోగా అమలు చేయలేమన్న విషయం సీఎం కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అందుకే, మధ్యంతర ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వతీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే క్రమంలో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడంలో స్పీకరు జాప్యం చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ఇంతకీ దీనికి షబ్బీర్ చెబుతున్న కారణం ఏంటంటే..? రెండు ఎంపీ స్థానాలు, 23 అసెంబ్లీ స్థానాలు, శాసనమండలి స్థానాలకు ఫిరాయింపు చట్టం కింద వేటు వేస్తే.. ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు వాటిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారని షబ్బీర్ అనుకుంటున్నారు. అందుకే, ఓడిపోతామన్న భయంతోనే.. ఆయన వచ్చే ఏడాదికి తప్పకుండా మధ్యంతర ఎన్నికలకు వెళతారని విమర్శించారు. షబ్బీర్ వాఖ్యలు విన్న గులాబీ నేతలు నవ్వుకుంటున్నారు. తాము చేస్తోన్న అభివృద్ధి పనులకు మెచ్చి పార్టీలకు పార్టీలే విలీనమవుతుంటే.. షబ్బీర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని కొట్టి పారేస్తున్నారు.
Advertisement