పార్టీలు వేరైనా... ఆ అనుబంధమే వేరు..!

స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్‌, మరో మహా రాజకీయవేత్త శివాజీలకు తోడు తెలుగుదేశం పల్లకీ మోయడానికి మరో బోయీ చేరాడు. ఆయనే సీపీఐ రామకృష్ణ.  తెలుగుదేశానికి ఎప్పుడు ఏ ఇబ్బంది, కష్టం వచ్చినా ఆ పార్టీ తరుపున ఒకాల్తా పుచ్చుకోవడానికి, తెలుగుదేశం తరుపున వాళ్ల వాదన వినిపించడానికి పై ఇద్దరూ ఎల్లవేళలా సిద్ధంగా వుంటారు. ఇప్పుడు వాళ్ల బాధ్యతను సీపీఐ రామకృష్ణ తన భుజస్కంధాలమీద వేసుకున్నాడు. రాజధానిలో సెక్రెటేరియట్‌ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఎన్ని […]

Advertisement
Update:2016-06-04 08:11 IST

స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్‌, మరో మహా రాజకీయవేత్త శివాజీలకు తోడు తెలుగుదేశం పల్లకీ మోయడానికి మరో బోయీ చేరాడు. ఆయనే సీపీఐ రామకృష్ణ.

తెలుగుదేశానికి ఎప్పుడు ఏ ఇబ్బంది, కష్టం వచ్చినా ఆ పార్టీ తరుపున ఒకాల్తా పుచ్చుకోవడానికి, తెలుగుదేశం తరుపున వాళ్ల వాదన వినిపించడానికి పై ఇద్దరూ ఎల్లవేళలా సిద్ధంగా వుంటారు. ఇప్పుడు వాళ్ల బాధ్యతను సీపీఐ రామకృష్ణ తన భుజస్కంధాలమీద వేసుకున్నాడు.

రాజధానిలో సెక్రెటేరియట్‌ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి. ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈ నెల 27లోపు అమరావతికి తరలి వెళితే పనిచేయడానికి ఆఫీసులు సిద్ధంగా లేవు. ఉండడానికి వసతి లేదు. కనీసం టీ దొరికే పరిస్థితి కూడా లేదు. అలాంటి అమరావతి బీడుభూములకు ఇప్పుడే వెళ్లి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగులు తల పట్టుకుంటున్నారు.

పిల్లలకు నెల క్రితమే ఈ ఏడాది ఫీజులు చెల్లించేశారు. ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ స్కూల్స్‌, కాలేజీలు లేవు. విజయవాడ, గుంటూరులలో చేరుద్దామన్నా సీట్లు దొరుకుతాయో లేవో? ఒక వేళ దొరికినా మళ్లీ రెండోసారి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి.

భార్యా భర్తలు వేరువేరు చోట్ల ఉద్యోగాలు, తల్లిదండ్రుల, అత్తమామల అనారోగ్యాలు, రిటైర్‌ అయ్యేదాకా హైదరాబాద్‌లోనే వుంటామన్న ఉద్దేశంతో ఇక్కడ సెటిల్‌ కావడం, అందుకు అనుగుణంగా జీవితాన్ని ప్లాన్‌ చేసుకోవడం తదితర పరిస్థితులమధ్య ఇప్పుడు ఒక్కసారిగా ఏ వసతులు లేని బీడుభూముల రాజధానికి వెళ్లమంటే ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. వీళ్లగోడు నాయకులకు పట్టడం లేదు. పైగా నాయకులు అధికారం పంచన చేరి ముఖ్యమంత్రి మాటలకు తానాతందానా అంటున్నారు. ఈ నేపధ్యంలో నిన్న ఉద్యోగులు నాయకులను వాళ్లమానాన వాళ్లను వదిలేసి ఉద్యోగులు మాత్రమే సమావేశమై తమ సమస్యలను చర్చించుకుని ప్రధానకార్యదర్శిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.

ఇప్పుడు దీనిపై స్పందించాల్సింది ముఖ్యమంత్రి. ఆయన ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి. దానివల్ల ఉద్యోగులకు బాధకలుగుతుంది. చంద్రబాబు మీద కోపం వస్తుంది. కాబట్టి ఆయన మోయాల్సిన భారాన్ని సీపీఐ రామకృష్ణ తన భుజాలమీదకు ఎత్తుకున్నాడు. చంద్రబాబుకు బదులుగా ఈయనే ఉద్యోగులు అమరావతికి వెళ్లి తీరాల్సిందేనని చెబుతున్నాడు. ఉద్యోగులు, కార్మికుల పక్షాన వుండాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటినుంచి అధికారం పంచన అంటకాగుతున్నాయో అప్పటినుంచి అవి ప్రజలకు ఎలా దూరమవుతున్నాయో చూస్తూనే వున్నాము. ఇప్పుడు ఉద్యోగులు రామకృష్ణమీద మండిపడతారు. కొంతలో కొంత చంద్రబాబు సేఫ్‌. పాపం సీపీఐ పార్టీ 1983 నుంచి తెలుగుదేశాన్ని నెత్తినపెట్టుకుని మోస్తోంది. అప్పుడప్పుడు చిన్న విమర్శలు చేసినా వాళ్లది ఎన్నటికీ విడిపోని కమ్మని బంధమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News