చంద్రబాబుపై కేఈ బ్రదర్ తిరుగుబాటు
టీడీపీ నుంచి రాజ్యసభకు ఇద్దరూ వ్యాపారవేత్తలనే ఎంపిక చేయడంపై టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ ప్రభాకర్ ఏకంగా రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ముందు బీసీనాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. కోట్లు ఇచ్చిన వారికే పదవులు ఇస్తారా అంటూ సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు కేఈ. డబ్బిచ్చినోళ్లనే రాజ్యసభకు పంపి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. బీసీలంటే చంద్రబాబుకు ఎందుకంత అలుసు అని ప్రశ్నించారు. తాము తలుచుకుంటే టీడీపీ […]
టీడీపీ నుంచి రాజ్యసభకు ఇద్దరూ వ్యాపారవేత్తలనే ఎంపిక చేయడంపై టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ ప్రభాకర్ ఏకంగా రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం ముందు బీసీనాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. కోట్లు ఇచ్చిన వారికే పదవులు ఇస్తారా అంటూ సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు కేఈ. డబ్బిచ్చినోళ్లనే రాజ్యసభకు పంపి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. బీసీలంటే చంద్రబాబుకు ఎందుకంత అలుసు అని ప్రశ్నించారు. తాము తలుచుకుంటే టీడీపీ పునాదులనే పెకిలిస్తామని హెచ్చరించడం ద్వారా కేఈ ప్రభాకర్ సంచలనం సృష్టించారు.
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో టీడీపీకి అర్థమయ్యేలా చేస్తామని శపథం చేశారాయన. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు చొరబడి పదవులను ఎత్తుకెళ్తున్నాయని కేఈ విమర్శించారు. పార్టీ కార్యాలయం వద్దే కేఈ ధర్నాకు దిగడంతో ఉలిక్కిపడ్డ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి వెంటనే అక్కడికి వచ్చారు. అయితే చక్రపాణిరెడ్డి సమక్షంలోనే కేఈ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. పదవులు కొనుక్కునేందుకు బీసీ వద్ద డబ్బులు లేవని ఎత్తిపొడిచారు. అయితే కేఈతో ఫోన్‌లో మాట్లాడిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు … ఈసారి న్యాయం చేసేలా చంద్రబాబును ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవుల విషయంలో సీఎంతో కొట్లాడి అయినా సరే న్యాయం చేస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సోదరుడే ఇలా నేరుగా పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.
Click on Image to Read: