మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయం చేయడానికి ఎప్పుడు వెనకాడడు. మరీ ముఖ్యంగా తన మనసుకు నచ్చితే ఎదుటి వ్యక్తి ఎవరైనా సాయం చేస్తాడు. తాజాగా అలాంటిదే మరో ఘటన ఒకటి బయటపడింది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన తర్వాత… ఎస్ జే సూర్య ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉండడంతో… ఈ గ్యాప్ లో ఆధునిక మహాభారతం అనే పుస్తకాన్ని చదువుతున్నాడు పవన్. ఈ పుస్తకాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కు బహుమతిగా అందజేశాడు. పుస్తకాన్ని […]
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయం చేయడానికి ఎప్పుడు వెనకాడడు. మరీ ముఖ్యంగా తన మనసుకు నచ్చితే ఎదుటి వ్యక్తి ఎవరైనా సాయం చేస్తాడు. తాజాగా అలాంటిదే మరో ఘటన ఒకటి బయటపడింది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన తర్వాత… ఎస్ జే సూర్య ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉండడంతో… ఈ గ్యాప్ లో ఆధునిక మహాభారతం అనే పుస్తకాన్ని చదువుతున్నాడు పవన్. ఈ పుస్తకాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కు బహుమతిగా అందజేశాడు. పుస్తకాన్ని ఆసాంతం చదివిన పవన్ చాలా థ్రిల్ గా ఫీలయ్యాడట. గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆ పుస్తకాల్ని కొని, తనకు పరిచయం ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులకు వాటిని బహుకరించాలని భావించాడట. అయితే ఎక్కడ వెదికినా ఆ పుస్తకం కనిపించలేదు. త్రివిక్రమ్ కూడా ఎక్కడో సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో దాన్ని కొని పవన్ కు ఇచ్చాడట. దీంతో నొచ్చుకున్న పవన్… శేషేంద్ర శర్మ కుటుంబసభ్యులతో మాట్లాడాడు. కేవలం ఆర్థిక కష్టాల వల్లనే పుస్తకం పునఃముద్రణకు నోచుకోలేదని తెలిసి బాధపడ్డాడు. వెంటనే శేషేంద్ర శర్మ కుమారుడితో మాట్లాడి… పుస్తకం మళ్లీ అచ్చయ్యేలా ఆర్థిక సాయం చేశాడు. 25వేల కాపీలకు సరిపడ మొత్తాన్ని వెంటనే అందించాడట. పవన్ తీసుకున్న ఈ చొరవతో ఓ మంచి పుస్తకం మార్కెట్లో అందుబాటులోరాబోతోంది.
Advertisement