జగదీశ్ రెడ్డికి ఎదురు గాలి తప్పదా?
తెలంగాణ ఉద్యమం, టీఆర్ ఎస్ నేతల్లో కీలకమైనవారిలో జగదీశ్ రెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం నల్లగొండజిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం జగదీశ్ రెడ్డి పరిస్థితి ఏమీ బాగునట్లుగా లేదు. ఆయనకు త్వరలోనే వర్గపోరు తప్పేలా లేదు. ఉద్యమకారుడిగా జగదీశ్ రెడ్డి దక్షిణ తెలంగాణలో తెలంగాణ రాష్ర్ట సమితి పాగా వేయడంలో ఈయన తనవంతు కృషి చేశారు. ఫలితంగా ఒక ఎంపీ సీటు, 6 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. […]
Advertisement
తెలంగాణ ఉద్యమం, టీఆర్ ఎస్ నేతల్లో కీలకమైనవారిలో జగదీశ్ రెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం నల్లగొండజిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం జగదీశ్ రెడ్డి పరిస్థితి ఏమీ బాగునట్లుగా లేదు. ఆయనకు త్వరలోనే వర్గపోరు తప్పేలా లేదు. ఉద్యమకారుడిగా జగదీశ్ రెడ్డి దక్షిణ తెలంగాణలో తెలంగాణ రాష్ర్ట సమితి పాగా వేయడంలో ఈయన తనవంతు కృషి చేశారు. ఫలితంగా ఒక ఎంపీ సీటు, 6 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. జిల్లాలో జగదీశ్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆయన పనితీరుపై కేసీఆర్ పెద్దగా సంతృప్తిగా లేరని తెలిసింది. అందుకే, జిల్లాలో పార్టీ పటిష్టానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నారన్న చర్చ ఊపందుకొంది. జిల్లాలో ఇంతకాలం పార్టీకోసం పనిచేసిన జగదీశ్ రెడ్డి వర్గం కోమటిరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కోమటిరెడ్డి పార్టీలో చేరడం వెనక భారీగానే లాబీయింగ్ నడిచిందన్న వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి పార్టీలో చేరేలా భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు మంత్రాంగం నడిపారని ప్రచారం సాగుతోంది.
నిన్నటి మొన్నటి దాకా మాటల కత్తులు దూసుకున్న ఈ రెండు వర్గాలు ఇకపై ఒకే వేదికపై పనిచేయాల్సి రావడం జగదీశ్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అంతేకాకుండా..ఇందుకోసం హరీశ్ మంత్రాంగం నడపడం, వీరి రాకకోసం కేసీఆర్ ఆసక్తి చూపడం జగదీశ్ రెడ్డిలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని తెలుస్తోంది. పైగా కోమటిరెడ్డి పార్టీలో చేరీ.. చేరగానే ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారంటూ జరుగుతున్న ప్రచారంతో వారి ఆందోళన రెట్టింపయింది. అందుకే, వెంకటరెడ్డి చేరికను జగదీశ్ రెడ్డి వర్గం బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. మునుముందు ఇంకెన్ని షాక్‌లు తగులుతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగదీశ్ రెడ్డి వర్గీయులు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలమెక్కించడమేంటని.. వారు వాపోతున్నారు.
Advertisement