గుల్బర్గ్ కేసులో బీజేపీ నేతకు క్లీన్ చిట్!
గోద్రా అల్లర్ల తరువాత తలెత్తిన గుల్బర్గ్ అల్లర్ల కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో బీజేపీ నేత బిపిన్ పటేల్‌తోపాటు మరో 24 మందని అహ్మదాబాద్ కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రత్యేక బృందం మొత్తం 60 మందిని దోషులుగా చేర్చింది. దీనిపై విచారించిన న్యాయస్థానం 60 మందిలో 24 మంది దోషులని, మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. గోద్రా అల్లర్ల అనంతరం చోటు చేసుకున్న ఈ […]
Advertisement
గోద్రా అల్లర్ల తరువాత తలెత్తిన గుల్బర్గ్ అల్లర్ల కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో బీజేపీ నేత బిపిన్ పటేల్‌తోపాటు మరో 24 మందని అహ్మదాబాద్ కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రత్యేక బృందం మొత్తం 60 మందిని దోషులుగా చేర్చింది. దీనిపై విచారించిన న్యాయస్థానం 60 మందిలో 24 మంది దోషులని, మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. గోద్రా అల్లర్ల అనంతరం చోటు చేసుకున్న ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారి తీశాయి. ఈ మారణహోమంలో దాదాపు 20,000 మందిపై దాడి జరిగిందంటే.. అల్లర్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చాలామందిని ఇంటి నుంచి బయటికి ఈడ్చుకు వచ్చి చంపేశారు. మరికొందరిని సజీవ దహనం చేశారు. దుండగులు సజీవదహనం చేసినవారిలో కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ కూడా ఉండటం గమనార్హం. ఆయతోపాటు మొత్తం 69 మందిని ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు.
అప్పుడు ఏం జరిగింది?
2002లో గోద్రా అల్లర్ల తరువాత గుల్బర్గ్ సొసైటీపై ముష్కరులు దాడి చేశారు. అక్కడున్న నివాస సముదాయాలను, అపార్ట్‌మెంట్లు, ఇళ్లపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న వారిని బయటికి ఈడ్చుకు వచ్చి చంపేశారు. మరికొందరిని పెట్రోలు పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో దుండగులు కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ ఇంటిపైనా దాడి చేశారు. ఈయన్ను బయటికి ఈడ్చుకువచ్చి సజీవ దహనం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 2009లో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా 2015లో విచారణ ముగిసింది. ఎంపీ జాఫ్రీ సతీమణి జకియా ఈ కేసులో న్యాయం కోసం నేటికీ పోరాడుతూనే ఉండటం విశేషం. ఆమెకు ఆరోగ్యం సహకరించకపోయినా న్యాయం కోసం పోరాడుతుండటం గమనార్హం.
Advertisement