"మీడియా నా కొడుకులు..."
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు మీడియామీద కోపం వచ్చింది. ఆయనమీద వ్యతిరేకంగా రాశారనో, విమర్శించారనో కాదు. ఆయనంతటివాడు ప్రెస్‌మీట్ పెడితే తక్కువ సంఖ్యలో ఛానల్స్‌వారు వచ్చారని, తక్కువ కెమెరాలు పెట్టారని ఆయన కోపం. ఆ కోపాన్ని అనుచుకోలేక “మీడియా నా కొడుకులు… మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు”….. వార్తల్లో నన్ను చూపించడంలేదు అంటూ అందరిముందు చిందులేశాడు. మెదక్‌జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈవిధంగా వీరంగాలు వేశాడు. దామోదర రాజనరసింహ అలా మాట్లాడడాన్ని నిరసించిన జర్నలిస్టులపై […]
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు మీడియామీద కోపం వచ్చింది. ఆయనమీద వ్యతిరేకంగా రాశారనో, విమర్శించారనో కాదు. ఆయనంతటివాడు ప్రెస్‌మీట్ పెడితే తక్కువ సంఖ్యలో ఛానల్స్‌వారు వచ్చారని, తక్కువ కెమెరాలు పెట్టారని ఆయన కోపం. ఆ కోపాన్ని అనుచుకోలేక “మీడియా నా కొడుకులు… మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు”….. వార్తల్లో నన్ను చూపించడంలేదు అంటూ అందరిముందు చిందులేశాడు.
మెదక్‌జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈవిధంగా వీరంగాలు వేశాడు. దామోదర రాజనరసింహ అలా మాట్లాడడాన్ని నిరసించిన జర్నలిస్టులపై దామోదర అనుచరులు బూతులు తిడుతూ చేయి చేసుకున్నారు. కెమెరాలను ధ్వంసం చేశారు. గాయపడ్డ మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో దామోదర రాజనరసింహపై ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడైన ఈయన మంత్రిగా వున్నప్పుడు కూడా జర్నలిస్టులతో పాటు తనను కలవడానికి వచ్చేవాళ్లను కూడా తనదైన శైలిలో గౌరవించేవాడు. తన టేబుల్ ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ వుంటే ఇక వెళ్లిపొమ్మని చెప్పడానికి ఒక టెక్నిక్ అవలంభించేవాడు. కుర్చీలో చేరగిలబడి కాళ్లుతీసి టేబుల్ మీద పెట్టేవాడు. ఆయన కాళ్లు ఎదురుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తుల మొఖానికి దగ్గరగా వుండేవి. ఆ గౌరవాన్ని తట్టుకోలేక ఎదుటివ్యక్తులు ఇక వస్తామని వెళ్లిపోయేవారు. ఇంత గొప్ప సంస్కారులతో నిండిన కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉజ్వల భవిష్యత్తు లేకుండా ఎలా వుంటుంది?
Click on Image to Read: