రాజ్యసభకు గురుశిష్యులు!
రాజకీయపార్టీల్లో పదవులు రాజకీయ నేతలతో భలే ఆటలు ఆడతాయి. ఈరోజు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వారు రేపు పార్టీలు మారి ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకోవచ్చు. నేడు తిట్టుకున్నవారు.. రేపు దోస్తులమంటూ భుజం కలుపుతారు. లోకం చాలా చిన్నది.. భూమి గుండ్రనిది అన్న సామెతలన్నీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి.. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ? తెలంగాణలో గురుశిష్యులుగా పేరుగాంచిన… ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. రాపోలు ఆనంద భాస్కర్‌ల గురించే.. వీరిద్దరూ కాంగ్రెస్‌లో గురుశిష్యులుగా […]
Advertisement
రాజకీయపార్టీల్లో పదవులు రాజకీయ నేతలతో భలే ఆటలు ఆడతాయి. ఈరోజు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వారు రేపు పార్టీలు మారి ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకోవచ్చు. నేడు తిట్టుకున్నవారు.. రేపు దోస్తులమంటూ భుజం కలుపుతారు. లోకం చాలా చిన్నది.. భూమి గుండ్రనిది అన్న సామెతలన్నీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి.. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ? తెలంగాణలో గురుశిష్యులుగా పేరుగాంచిన… ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. రాపోలు ఆనంద భాస్కర్‌ల గురించే.. వీరిద్దరూ కాంగ్రెస్‌లో గురుశిష్యులుగా పేరొందారు. ఆయనకు ఎంపీ టికెట్ రావడంలో డీఎస్ తన వంతు కృషి చేశారు. ఇటీవల డీఎస్ పార్టీ మారినపుడు ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కూడా టీఆర్ ఎస్‌లోకి వెళతారని అంతా అనుకున్నా అలా జరగలేదు. అనంతరం వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి కనీసం తనను సంప్రదించలేదని, జిల్లాకు చెందిన తనను విస్మరించడం ఆవేదన కలిగించిందని ఆనంద భాస్కర్ తన అసంతృప్తిని మీడియా ముందే వెళ్లగక్కాడు. దీంతో రాపోలు కారెక్కుతాడన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఈ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ ఉత్తమ్ రాపోలుకు ఫోన్ చేసి బుజ్జగించడంతో వివాదం సద్దుమణిగింది.
శిష్యుడే గురువు వద్దకు చేరతాడునుకుంటే.. గురువే శిష్యుడి వద్దకు వెళుతున్నాడు. అంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాపోలు ఆనంద్ భాస్కర్ వద్దకు డీఎస్ ఎంపీ హోదాలో అదే రాజ్యసభకు వెళ్లనుండటం విశేషం. మొత్తానికి గురు శిష్యులు ఇద్దరూ ఒకే సభకు వెళుతున్నారు. దీంతో వీరికి కలిసి మాట్లాడుకునే అవకాశం దొరికింది. విచిత్రమంటే ఇదే కదా! ఒకే పార్టీలో ఉన్నపుడు కలిసి రాని అవకాశం పార్టీలు మారక ఒకే సభలో కలిసి పనిచేసేందుకు వచ్చింది. మరిదే రాజకీయమంటే! అందరూ ఊహించనట్లు జరిగితే.. ఇక దీన్ని రాజకీయమని ఎందుకంటారు? అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఓ ఆందోళన రేగుతోంది. ఎంపీ రాపోలు ఆనంద్ బాస్కర్ ను డీఎస్ లాబీయింగ్ చేసి ఎక్కడ కారెక్కిస్తే మరో నేతను కోల్పోతామన్నదే వారి ఆందోళన!
Advertisement