బాబు కోసం భూమా తాకట్టు!

అన్నింటికన్నా విలువైనది వ్యక్తిత్వం. అది ఉంటే కలిగే ఆనందం డబ్బుతోనూ రాదు. కానీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మెప్పుకోసం తమ వ్యక్తిత్వాలను కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టకుండా వెనక్కు తగ్గిన విషయంలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో భూమా తన వ్యక్తిత్వాన్ని తెలియకుండానే తాకట్టు పెట్టేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని, గెలిచి తీరుతామని తాము చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చామని మీడియాతో భూమా చెప్పారు. […]

Advertisement
Update:2016-06-01 05:31 IST

అన్నింటికన్నా విలువైనది వ్యక్తిత్వం. అది ఉంటే కలిగే ఆనందం డబ్బుతోనూ రాదు. కానీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మెప్పుకోసం తమ వ్యక్తిత్వాలను కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టకుండా వెనక్కు తగ్గిన విషయంలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో భూమా తన వ్యక్తిత్వాన్ని తెలియకుండానే తాకట్టు పెట్టేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని, గెలిచి తీరుతామని తాము చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చామని మీడియాతో భూమా చెప్పారు. కానీ చంద్రబాబు రాజకీయ విలువలను కాపాడాలన్న ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. కాసేపు ఈ విషయం నిజమే అనుకుందాం. చంద్రబాబు రాజకీయ విలువలకు కట్టుబడే నాలుగో అభ్యర్థిని నిలబెట్టడాన్ని అంగీకరించలేదనుకుందాం!. మరి చంద్రబాబుకు ఉన్న రాజకీయ విలువలు భూమా నాగిరెడ్డికి, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు లేవా?. వీరికి కూడా రాజకీయ విలువలు ఉండి ఉంటే నాలుగో అభ్యర్థిని నిలబెట్టడం అనైతికమనే చెప్పాలి గానీ… సంఖ్యాబలం లేకున్నా సరే నాలుగో అభ్యర్థిని నిలబెడుదామని చంద్రబాబుకు ఎలా సలహా ఇచ్చారో?. సరే భూమానాగిరెడ్డి రాజకీయాల్లోకి నిన్నమొన్న వచ్చిన చంటి పిల్లాడనుకుంటే రాజకీయ విలువలు, నైతికత అనే సబ్జెక్ట్పై పట్టులేదని సరిపెట్టుకోవచ్చు.

కానీ భూమా కూడా మోస్ట్ సీరియర్ లీడరే కదా!. బాబుకు ఉన్న విలువలు ఈయనకు ఎందుకు లేవో!. భూమా చెప్పిన మాటలు బట్టి ఆయనకు , ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యక్తిత్వం, రాజకీయ విలువలు లేవనే అనుకోవాల్సి ఉంటుంది. అయినా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు లేని రాజకీయ విలువలు, ప్రభుత్వ కార్యక్రమ వేదికలపైనే ఫిరాయింపుదారులకు కండువా కప్పినప్పుడు కనిపించని నైతికత… రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందంటే నమ్మవచ్చా?. చంద్రబాబుకు నిజంగా రాజకీయవిలువలు ఉన్నాయి…. తాను దగ్గర నుంచి చూశానని పార్టీ ఫిరాయించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తిరుగుతున్న భూమా నాగిరెడ్డి చెబితే జనం నమ్మవచ్చా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News