చేరికే ఆలస్యం.. వార్తలు నిజమే!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ – కాంగ్రెస్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలనుంది. టీడీపీకి చెందిన చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కారెక్కనున్నారన్న వార్తలు రెండు పార్టీలకు మింగుడుపడటం లేదు. మల్కాజిరిగి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపీ మల్లారెడ్డి రంగారెడ్డి జిల్లాలో పేరున్న విద్యావేత్త. తెలుగుదేశానికి ఆర్థికంగా అండదండలు అందిస్తూ పెద్దదిక్కుగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్థికంగా, కార్యకర్తల పరంగా నల్లగొండ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ – కాంగ్రెస్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలనుంది. టీడీపీకి చెందిన చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కారెక్కనున్నారన్న వార్తలు రెండు పార్టీలకు మింగుడుపడటం లేదు. మల్కాజిరిగి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపీ మల్లారెడ్డి రంగారెడ్డి జిల్లాలో పేరున్న విద్యావేత్త. తెలుగుదేశానికి ఆర్థికంగా అండదండలు అందిస్తూ పెద్దదిక్కుగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్థికంగా, కార్యకర్తల పరంగా నల్లగొండ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. వీరిద్దరి చేరిక ఎవరికీ ఎలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే.. గతంలో చాలాసార్లు వీరు టీఆర్ ఎస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎందుకనో ఆ విషయం వాయిదాపడింది. ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తమ పార్టీలకు టాటా చెప్పి కారెక్కేందుకు అంతా సిద్ధం చేసుకున్నారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మల్లారెడ్డి బాబుపై అలిగాడా?
చామకూర మల్లారెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పేరున్న విద్యావేత్త. దీంతో 2014లో దేశంలో అత్యధిక మంది జనాభా ఉన్న నియోజకవర్గంగా పేరొందిన మల్కాజిగిరి నుంచి ఈయన ఎంపీ టికెట్ సాధించగలిగారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంది. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డికి ఆప్తమిత్రుడు, బంధువు కావడంతో ఈయనకు టికెట్ సులువుగానేవచ్చింది. పైగా ఈయన పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే ప్రచార ఖర్చులు కూడా ఈయనే భరించాడని చెప్తారు. కానీ, చంద్రబాబు అప్పట్లో ఈ సీటువిషయంలో డబుల్ గేమ్ ఆడాడు. ఈ స్థానంలో లోక్‌సత్తా నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ పోటీ చేశాడు. అతనికి టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ- జనసేన ప్రచారానికి సిద్ధపడ్డాయి. దీంతో కోపం నషాళానికెక్కిన మల్లారెడ్డి బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట. దీంతో వెనక్కి తగ్గిన బాబు పవన్‌కల్యాణ్ ను లోక్‌సత్తాకు అనుకూలంగా ప్రచారానికి వెళ్లకుండా ఆపాడు. 2009లోనూ టీఆర్ ఎస్‌కు టికెట్ ఇచ్చిన బాబు.. పరోక్షంగా టీడీపీ ఓట్లను జేపీకి వేయించాడన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి బాబుపై పీకల దాకా కోపంతో ఉన్న చామకూర ఇప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడని నియోజకవర్గం వాసులు అనుకుంటున్నారు.
కోమటిరెడ్డి చేరిక దాదాపు 6 ఏళ్లు ఆలస్యం!
2010లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ సమయంలో సీఎంగా ఉన్న రోశయ్యకు బహిరంగంగా హెచ్చరికలు జారీచేశాడు. దీనిపై రోశయ్య ఫిర్యాదు చేయడంతో అధిష్టానం కోమటిరెడ్డి వివరణ కోరింది. ఈ పరిణామంపై నొచ్చుకున్న కోమటిరెడ్డి టీఆర్ ఎస్‌లో చేరతాడన్న ప్రచారం జరిగింది. అది మొదలు ప్రతి 6 నెలలకోసారి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇవి మరింత పెరిగాయి. అయినా వాస్తవరూపం దాల్చలేదు. మరి తాజాగా తేదీలు, మహూర్తం కూడా ఖారారవడంతో ఇప్పుడు జనాలకు ఆయన పార్టీపై క్లారిటీ వచ్చింది.
Advertisement