బాబు విలువను వివరించిన భూమా, జగన్‌పై విమర్శలు
వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కనివ్వబోమని టీడీపీ మంత్రులు, సీఎం రమేష్ లాంటి ఎంపీలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. చంద్రబాబు కూడా నాలుగో అభ్యర్థిపై ఏం చేయాలో అదే చేస్తామన్నారు. కానీ చివరకు వైసీపీ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను రాబట్టుకోవడంలో టీడీపీ విఫలమైంది. దీంతో నాలుగో అభ్యర్థిని నిలబెట్టలేక పరువు పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ … నాలుగో అభ్యర్థిని నిలబెడితే […]
వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కనివ్వబోమని టీడీపీ మంత్రులు, సీఎం రమేష్ లాంటి ఎంపీలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. చంద్రబాబు కూడా నాలుగో అభ్యర్థిపై ఏం చేయాలో అదే చేస్తామన్నారు. కానీ చివరకు వైసీపీ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను రాబట్టుకోవడంలో టీడీపీ విఫలమైంది. దీంతో నాలుగో అభ్యర్థిని నిలబెట్టలేక పరువు పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ … నాలుగో అభ్యర్థిని నిలబెడితే గెలిచితీరుతామని తాము సీఎంకు చెప్పామన్నారు. కానీ చంద్రబాబు వ్యతిరేకించారని చెప్పారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సి ఉందని… అలా చేయకపోతే చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అన్నారని భూమా చెప్పారు. ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి జగనే నానా పాట్లు పడ్డారని భూమా ఆరోపించారు. తాము అమ్ముడుపోయామని అందరూ అంటుంటే బాధగా ఉందని ఫీల్ అయ్యారు భూమా. చంద్రబాబు స్థానంలో జగన్ ఉంటే ఖచ్చితంగా నాలుగో అభ్యర్థిని నిలబెట్టేవారని భూమా చెప్పారు. జగనే తన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి… ఇప్పుడు చంద్రబాబును విమర్శించడం బాగోలేదన్నారు. కర్నూలు జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాజ్యసభకు వెళ్లలేదని ఆ అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు అన్నారు. జగన్ తన ఇంటి వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారని భూమా విమర్శించారు.
Click on Image to Read: