పొలిట్‌బ్యూరో భేటీ నుంచి బయటకొచ్చిన ఆ ఇద్దరు...ఇక పూర్తిగా బయటకేనా?
విజయవాడలో ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో పొలిటిబ్యూరో సభ్యులంతా పాల్గొన్నారు. అయితే సమావేశం ప్రారంభంకాగానే రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేతలు గదిలో నుంచి బయటకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. వెంటనే సుజనాచౌదరితో పాటు రావులచంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు బయటకు వెళ్లిపోయారు. దీంతో రావుల, మోత్కుపల్లి ఇద్దరూ రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్టు స్పష్టమైంది. మహానాడు వేదికపైనే మోత్కుపల్లి ఏకంగా చంద్రబాబును బతిమలాడుకున్నంత పని చేశారు. […]
విజయవాడలో ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో పొలిటిబ్యూరో సభ్యులంతా పాల్గొన్నారు. అయితే సమావేశం ప్రారంభంకాగానే రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేతలు గదిలో నుంచి బయటకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. వెంటనే సుజనాచౌదరితో పాటు రావులచంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు బయటకు వెళ్లిపోయారు. దీంతో రావుల, మోత్కుపల్లి ఇద్దరూ రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్టు స్పష్టమైంది.
మహానాడు వేదికపైనే మోత్కుపల్లి ఏకంగా చంద్రబాబును బతిమలాడుకున్నంత పని చేశారు. అలసిపోయానని, చేతిలో పది రూపాయలుకూడా లేవని తన గురించి ఆలోచించాలని పదేపదే విన్నవించుకున్నారు. ఇప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా రేసులోకి వచ్చారు. అయితే తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు లేరని చెబుతున్నారు. అదే జరిగితే రావుల, మోత్కుపల్లి తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
చంద్రబాబుపై ఈగవాలకుండా చూసుకున్నమోత్కుపల్లికి సీటు ఇవ్వకపోతే దాన్ని ఆయన తట్టుకోలేరని చెబుతున్నారు. గవర్నర్‌గా పంపుతామని మొదట్లో మోత్కుపల్లిని బాబు నమ్మిస్తూ వచ్చారు. అది అయ్యేపని కాదన్న నిర్ధారణకు వచ్చిన మోత్కుపల్లి ఇప్పుడు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. కానీ అది దక్కే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు రాజ్యసభ ఎన్నిక తర్వాత కొత్త దారి చూసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.
Click on Image to Read: