బాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగుస్తుంది

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్‌లో జరిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి సంపాదనలో మునిగితేలుతున్న చంద్రబాబు నోటికి వచ్చినట్లు ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అడవి పందులతో పోల్చిన బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2050 వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని మహానాడులో చంద్రబాబు చెప్పడంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని ఆయన రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో […]

Advertisement
Update:2016-05-30 15:54 IST

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్‌లో జరిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి సంపాదనలో మునిగితేలుతున్న చంద్రబాబు నోటికి వచ్చినట్లు ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అడవి పందులతో పోల్చిన బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2050 వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని మహానాడులో చంద్రబాబు చెప్పడంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని ఆయన రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగుస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి విమర్శించారు.

మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకహోదా కోసం ఎంపీ కేవీపీ రామచంద్రరావురాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు ఇతరపార్టీల మద్దతు కూడగడతామని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News