ముందు ఆ పని చేసి నీతులు చెప్పు...
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎంపీ కేవీపీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎదుటి వాళ్ల నీతినిజాయితీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ముందు తనపై ఉన్న 16 కేసుల్లో స్టే ఎత్తివేయించుకుని మాట్లాడాలన్నారు. స్టేఎత్తివేయించుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకుని అప్పుడు నీతులు చెప్పాలన్నారు. తాను హేరిటేజ్ పాలలాగా స్వచ్చమైన వ్యక్తినని చెప్పుకునే చంద్రబాబు… కేసుల్లో స్టేలు తెచ్చుకుని బతకడం మానుకోవాలన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుపై ఇంతకు మించి కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు కేవీపీ. జగన్ తన మేనల్లుడని… అతడితో […]
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎంపీ కేవీపీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎదుటి వాళ్ల నీతినిజాయితీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ముందు తనపై ఉన్న 16 కేసుల్లో స్టే ఎత్తివేయించుకుని మాట్లాడాలన్నారు. స్టేఎత్తివేయించుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకుని అప్పుడు నీతులు చెప్పాలన్నారు. తాను హేరిటేజ్ పాలలాగా స్వచ్చమైన వ్యక్తినని చెప్పుకునే చంద్రబాబు… కేసుల్లో స్టేలు తెచ్చుకుని బతకడం మానుకోవాలన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుపై ఇంతకు మించి కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు కేవీపీ. జగన్ తన మేనల్లుడని… అతడితో లేకుండా ఎలా ఉంటామన్నారు. కానీ అవి కుటుంబ విషయాలని కేవీపీ చెప్పారు. వైఎస్ గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు.
జగన్‌తో పాటు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించగా కేవీపీ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. జగన్‌ను అవినీతిపరుడు అనడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. జగన్ తప్పు చేశాడా లేదా అన్నది ఇప్పుడు కోర్టులు తేలుస్తాయని దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జగన్‌ది దోషం ఉండే అవకాశమే లేదన్నారు. 2004 నుంచి 2009 వరకుజరిగిన వ్యవహారాల్లో తాను కూడా భాగస్వామినేనని వాటిని సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగింది 2009 తర్వాత అన్న విషయం కూడా గుర్తించుకోవాలన్నారు. జగన్‌ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు కేవీపీ స్పందించలేదు. రాజకీయాలు వదిలేసి ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడగాలని సూచించారు. వెంకయ్యనాయుడు తనకు అనుకూలమైన విషయాలను మాత్రమే మాట్లాడుతుంటారని కేవీపీ విమర్శించారు.
Click on Image to Read: