రామోజీ నన్ను ఎక్స్‌ట్రాలు వద్దన్నారు... సుమన్ కూడా 10నిమిషాల్లో రాజీనామా చేశారు
ఈనాడు అధినేత రామోజీరావు కుమారుడు సుమన్, టీవీ నటుడు ప్రభాకర్ మధ్య సన్నిహితం గురించి అందరికీ తెలుసు. వీరి స్నేహం మితిమీరడం వల్లే రామోజీ, కుమారుడు సుమన్ మధ్య విభేదాలు వచ్చాయని చెబుతుంటారు. ఈ విషయంపై స్పందించిన నటుడు ప్రభాకర్ పలు విషయాలు చెప్పారు. రామోజీ, సుమన్ మధ్య మొదటి నుంచి వ్యక్తి గత విభేదాలుండేవని చెప్పారు. ఒక దశలో ఛానల్ వ్యవహారాలను చెరిసగం టైమ్‌లో చూసుకునేవారని చెప్పారు. అయితే ఇలాచేయడం వల్ల ఛానల్ క్వాలిటీ దెబ్బతింటున్న విషయాన్ని […]
ఈనాడు అధినేత రామోజీరావు కుమారుడు సుమన్, టీవీ నటుడు ప్రభాకర్ మధ్య సన్నిహితం గురించి అందరికీ తెలుసు. వీరి స్నేహం మితిమీరడం వల్లే రామోజీ, కుమారుడు సుమన్ మధ్య విభేదాలు వచ్చాయని చెబుతుంటారు. ఈ విషయంపై స్పందించిన నటుడు ప్రభాకర్ పలు విషయాలు చెప్పారు. రామోజీ, సుమన్ మధ్య మొదటి నుంచి వ్యక్తి గత విభేదాలుండేవని చెప్పారు. ఒక దశలో ఛానల్ వ్యవహారాలను చెరిసగం టైమ్‌లో చూసుకునేవారని చెప్పారు. అయితే ఇలాచేయడం వల్ల ఛానల్ క్వాలిటీ దెబ్బతింటున్న విషయాన్ని తాను సుమన్‌కు వివరించాననిచెప్పారు. దాంతో సుమన్ ఆదేశాలమేరకు ఉదయం వేస్తున్న కార్యక్రమాలను రద్దు చేశానన్నారు. ఈ విషయం తెలియగానే రామోజీరావుకు కోపం వచ్చిందని వెంటనే రావాల్సిందిగా సెక్రటరీ ద్వారా ఫోన్ చేయించారని గుర్తు చేశారు.
”మీ ఇద్దరి స్నేహం వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. కానీ నీవు కొంచెం ఎక్కువ చేస్తున్నావ్” అని రామోజీరావు అన్నారని ప్రభాకర్ చెప్పారు. ” నేను తీసుకున్న నిర్ణయాన్నిఎలా మారుస్తావ్.. అలా చేసి చాలా పెద్ద తప్పు చేశావ్. నీవు చేసే కార్యక్రమాల వల్లే డబ్బులు వస్తున్నాయ్ అనుకుంటున్నావా? ” అంటూ రామోజీ సీరియస్ అయినట్టు చెప్పారు. అయితే తాను కూడా ఏ కార్యక్రమానికి ఎంత వస్తోందో పత్రికలే రాశాయి కదా అని ప్రశ్నించినట్టు చెప్పారు. దీంతో చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్ అని రామోజీరావు హెచ్చరించారట. అప్పుడు తనకు భయమేసిందని ప్రభాకర్ చెప్పారు. దీంతో రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పగా నీ ఇష్టం అని రామోజీ అన్నట్టు నటుడు వెల్లడించారు.
ఈ విషయాన్ని వెళ్లి సుమన్ కు చెప్పానన్నారు. దీంతో ”నీవు వెళ్లిపోతే నేనూ ఉండను.. నేను కూడా రాజీనామా చేస్తా” అని అంటూ తాను రాజీనామా చేసిన పది నిమిషాల్లో సుమన్ కూడా రాజీనామా చేశారని ప్రభాకర్ చెప్పారు. తండ్రికొడుకు మధ్య మొదటి నుంచి కూడా గొడవలున్నట్టుగా అనిపించిందని వాటి మధ్యలో తాను ఇరుక్కున్నట్టుగా ఉందన్నారు ప్రభాకర్.
Click on Image to Read: