గద్దలకు హద్దులు లేవు... టీడీపీ నేతల వెయ్యి కోట్ల భూకుంభకోణం
కుంభకోణం అంటే ఒకప్పుడు రహస్యంగా జరిగేది. టీడీపీ నేతలు మాత్రం రహస్యమనే ముసుగు తీసేశారు. తమ కుంభకోణాలకు అడ్డుచెప్పేవారెవరు?. అడ్డుచెప్పినా కుంభకోణం ఆపే దమ్మున్న వాడుఎవడు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. తాజాగా వెయ్యికోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. ఎకరం రూ.6 కోట్లు పలుకుతున్నట్టు జాయింట్ కమిషనర్ చెప్పినా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఎకరం కేవలం రూ. 27లక్షలకు బాబు సర్కార్ అప్పగించేసింది. ఇదంతా అధికారికంగానే చేయడం మరో విచిత్రం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి మహలక్ష్మమ్మ 1849లో […]
కుంభకోణం అంటే ఒకప్పుడు రహస్యంగా జరిగేది. టీడీపీ నేతలు మాత్రం రహస్యమనే ముసుగు తీసేశారు. తమ కుంభకోణాలకు అడ్డుచెప్పేవారెవరు?. అడ్డుచెప్పినా కుంభకోణం ఆపే దమ్మున్న వాడుఎవడు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. తాజాగా వెయ్యికోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. ఎకరం రూ.6 కోట్లు పలుకుతున్నట్టు జాయింట్ కమిషనర్ చెప్పినా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఎకరం కేవలం రూ. 27లక్షలకు బాబు సర్కార్ అప్పగించేసింది. ఇదంతా అధికారికంగానే చేయడం మరో విచిత్రం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి మహలక్ష్మమ్మ 1849లో అమరావతి దేవస్థానానికి చెన్నైలోని భూములను విరాళంగా ఇచ్చారు. శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతం అత్యంత ఖరీదైన ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉంది. మొత్తం 473 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అయితే ఆ భూమి చాలా వరకు ఆక్రమణకు గురై ఇప్పుడు కేవలం 83.11 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీనిపైనే టీడీపీ బడాబాబులు కన్నేశారు.
తన నియోజకవర్గంలోని శ్రీసదావర్తి సత్రానికి (అమరావతి ఆలయ పరిధిలోనిది) చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖ రాయించింది కూడా పెద్దలే. అలా లేఖ అందిన వెంటనే బాబు కార్యాలయం ఆగమేఘాల మీద స్పందించింది. 2014 సెప్టెంబర్ 12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తెర వెనుక దేవాదాయశాఖకు ఆదేశాలు వెళ్లాయి. అంతే భూముల వేలానికి దేవాదాయశాఖ తలూపేసింది. అప్పుడే టీడీపీ నేతలు జూలు విధించారు.
83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న మొదటి విడత వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయిం చిన ధర ఎకరా రూ.50 లక్షలకు కొనడానికి ఎవరూ ముందు కు రాలేదట. అంతే ఆ కారణం చెప్పి భూమి విలువకు ఎకరాలకు రూ. 27లక్షలుగా నిర్ణయించారు. 83.11 ఎకరాలను రూ.22.44 కోట్లకు కొట్టేశారు. ఇలా భూమిని చీప్‌గా కొట్టేసింది ఎవరంటే చంద్రబాబుకు అత్యంత ఇష్టుడైన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ భార్య చలమలశెట్టి లక్ష్మీపార్వతి, కుమారుడు చలమలశెట్టి నిరంజన్‌బాబులు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆలయ భూమి చుట్టుపక్కల ధర ఎకరం రూ. ఆరు కోట్లు పలుకుతోందని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని భూములు అమ్మాలని దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ప్రభుత్వం మాత్రం ధరను పదేపదే తగ్గించి ఎకరం రూ. 27లక్షల చొప్పున టీడీపీ నేతలకు కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్ లెక్కల ప్రకారం 83.11 ఎకరాల భూమి విలువ రూ. 1080 కోట్లు అవుతుంది. ఈ మొత్తం డీల్‌లో ఎప్పటిలాగే పెద్దలకు వాటా కూడా భారీగా అందిందని వార్తలొస్తున్నాయి.
Click on Image to Read: