జగన్ కి ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..?

పోరాటం రెండు రకాలుగా ఉంటుంది. సిద్ధాంతంపై పోరాటం చేయడం లేదంటే వ్యక్తులపై పోరాటం చేయడం. సాధారణంగా రాజకీయ పార్టీలు సిద్ధాంతాలపరంగానే పోరాటం చేస్తుంటాయి. కానీ జగన్ ఏ పాయింట్ మీద పోరాటంచేస్తున్నారన్న దానిపై ఆయన సాక్షి టీవీనే తికమకపెడుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీ అభిప్రాయానికి సాక్షి ప్రతిబింబమే. అలాంటి టీవీ ఛానల్లో ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి సందర్భంగా ప్రసారం అయ్యే కథనాలు కాసింత ఆసక్తికరంగానే ఉంటున్నాయి. తొలి నుంచి కూడా రాజకీయంగా వైసీపీని […]

Advertisement
Update:2016-05-27 14:43 IST

పోరాటం రెండు రకాలుగా ఉంటుంది. సిద్ధాంతంపై పోరాటం చేయడం లేదంటే వ్యక్తులపై పోరాటం చేయడం. సాధారణంగా రాజకీయ పార్టీలు సిద్ధాంతాలపరంగానే పోరాటం చేస్తుంటాయి. కానీ జగన్ ఏ పాయింట్ మీద పోరాటంచేస్తున్నారన్న దానిపై ఆయన సాక్షి టీవీనే తికమకపెడుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీ అభిప్రాయానికి సాక్షి ప్రతిబింబమే. అలాంటి టీవీ ఛానల్లో ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి సందర్భంగా ప్రసారం అయ్యే కథనాలు కాసింత ఆసక్తికరంగానే ఉంటున్నాయి.

తొలి నుంచి కూడా రాజకీయంగా వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా జగన్ తాత రాజారెడ్డినుంచి వైఎస్ వరకు అందరిపైనా నెగిటివ్ ప్రచారమే చేస్తుంటాయి. వైఎస్ ఒక రాక్షసుడు అంటూ ప్రచారాం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మూలమే అవినీతిమయం అనిప్రచారం చేస్తోంది. రాజారెడ్డి ,వైఎస్, జగన్ ఇలా వైఎస్ కుటుంబాన్ని మొత్తం చెడు కోణంలోనే చూపిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు టీడీపీ, దాని మీడియా వేసిన పక్కా ప్రణాళిక అది. ఆ ప్రయత్నంలో కొంత వరకు టీడీపీ విజయం కూడా సాధించింది. కానీ జగన్‌, ఆయన మీడియా తీరు అందుకు పూర్తి భిన్నం.

ఎన్టీఆర్ ప్రస్థావన వచ్చిన ప్రతీసారి, చంద్రబాబును విమర్శించాల్సివచ్చిన సందర్భంలోనూ సాక్షి తన కథనాల్లో ఎన్టీఆర్ వీరుడు, శూరుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ కథనాలు రాస్తోంది. ఎన్టీఆర్‌ గొప్పవారే అయి ఉండవచ్చు. కానీ తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు, ఆయనే లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదంటూ కథనాలు రాయడం విశేషమే. రాజకీయాల గురించి సరైన అవగాహనలేని తనమే. నిజంగా ఎన్టీఆర్‌ వల్లే తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడిందా?. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో అందరూ ఆత్మగౌరవం చంపుకుని బతికారా?. అదే నిజమైతే ఆ జాబితాలో వైఎస్‌ కూడా ఉన్నారు కదా!. వైఎస్ ఆత్మగౌరవం లేని వ్యక్తా?

ఎన్టీఆర్‌ అంత గొప్పవారే అయితే ఆయనను ప్రతిపక్షనాయకుడిగా వైఎస్ ఎందుకు ఎదురించిపోరాడారో?. ఒక రోజు రాత్రి ఎన్టీఆర్ ఇంటి వద్దకు వెళ్లి వైఎస్ నేరుగా సవాల్ కూడా విసిరారని చెబుతుంటారు. ఎన్టీఆర్‌ను పొగిడితే ఆయన అభిమానులు, ఆయన సామాజిక వర్గం జగన్‌కు దగ్గరవుతారని అనుకుంటున్నారేమో!. కానీ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించింది ఎందుకో తెలుసు కదా?. కాంగ్రెస్‌కు, ఆపార్టీ ద్వారా రాష్ట్రాన్ని ఏలుతున్న వారికి వ్యతిరేకంగానే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు. ఆ సమయంలో కొన్ని వర్గాలు ఎన్టీఆర్ పక్షాన చేరితే మరికొన్ని వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపు నిలిచాయి. ఎన్టీఆర్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ నేతలు కొందరు సినీ పెద్దలతో కలిసి “మండలాధీశుడు” అనే సినిమాను కూడా తీశారు. ఈరోజు ఏపీలో కాంగ్రెస్ చనిపోయి ఉండవచ్చు. కానీ జగన్‌ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. గతంలో కాంగ్రెస్‌కు ఓటేసిన వారే ఇప్పుడు జగన్ వెంట మూకుమ్మడిగా నడుస్తున్నారు. ఒకప్పుడు టీడీపీకి, ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడిన వర్గాలే వైసీపీ వెంట ఉన్నాయి. ఇప్పుడేదో జగన్ మీడియా చరిత్రలో కొత్త అంశాలను కనిపెట్టినట్టు ఎన్టీఆర్ వీరుడు శూరుడు, ఆయనే లేకుంటే స్టేట్ అప్పట్లో ఏమైపోయేదో అని కథనాలు ప్రసారాలు చేయడంబట్టి జగన్ మీడియా అందులో పనిచేసే వ్యక్తుల సొంత అభిప్రాయాలకే తప్ప ఆ పార్టీ ఫిలాసఫీకీ, ఆ పార్టీ వెంట ఉన్న వారి మనోభావాలకు చోటిస్తున్నట్టు అనిపించదు.

ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ చాలా గొప్పపార్టీ… కేవలం చంద్రబాబే విలన్‌ అన్నట్టు డబ్బాకొట్టడం ద్వారా వైసీపీ ఎంతవరకు మైలేజ్ సాధిస్తుందో?. అంటే రేపు పొద్దున చంద్రబాబు పదవి నుంచి దిగిపోయి మరో వ్యక్తి టీడీపీ పగ్గాలు చేపడితే అప్పుడు టీడీపీ చాలా గొప్ప పార్టీ అని జగన్ మీడియా ప్రచారం చేస్తుందా?. టీడీపీ కార్యకర్తల నుంచి వారి మీడియా ఛానళ్ల వరకు వైఎస్ ఒక రాక్షసుడు అని ప్రసారం చేస్తుంటే… జగన్ మీడియా మాత్రం ఎన్టీఆర్ గ్రేట్, టీడీపీ మూలాలు మంచివే, చంద్రబాబే వేస్ట్ అని ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబును ఎదుర్కొవచ్చునేమో గానీ… ధీర్ఘకాలంలో టీడీపీని సిద్ధాంతపరంగా ఎదురించలేరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News