సతాయించే పెళ్లాముంటే...మధుమేహం పరార్!
ఇది విచిత్రమే. అత్యంత అన్యోన్యమైన వివాహబంధం కంటే ఎప్పుడూ సతాయించే భార్య ఉన్న మగవారికి మధుమేహం అదుపులో ఉంటుందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హ్యూల్యూ ఈ అధ్యయనానికి సారధ్యం వహించారు. భర్త ఆరోగ్యంలో ఏ చిన్న లోపమున్నా కొంతమంది భార్యలు డాక్టరుకి చూపించుకోమని సతాయిస్తుంటారని, వారిలోని ఈ సతాయింపు గుణాన్ని….చెడుగా కాకుండా వారు జాగ్రత్త తీసుకోవడంగా భావించాలని ల్యూ చెబుతున్నాడు. మధుమేహం అదుపులో ఉండాలంటే తరచుగా పరీక్షలు […]
ఇది విచిత్రమే. అత్యంత అన్యోన్యమైన వివాహబంధం కంటే ఎప్పుడూ సతాయించే భార్య ఉన్న మగవారికి మధుమేహం అదుపులో ఉంటుందని ఒక నూతన అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హ్యూల్యూ ఈ అధ్యయనానికి సారధ్యం వహించారు. భర్త ఆరోగ్యంలో ఏ చిన్న లోపమున్నా కొంతమంది భార్యలు డాక్టరుకి చూపించుకోమని సతాయిస్తుంటారని, వారిలోని ఈ సతాయింపు గుణాన్ని….చెడుగా కాకుండా వారు జాగ్రత్త తీసుకోవడంగా భావించాలని ల్యూ చెబుతున్నాడు. మధుమేహం అదుపులో ఉండాలంటే తరచుగా పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఏదో ఒక విషయంపై ఎప్పుడూ పోరుపెట్టే మనస్తత్వం ఉన్న భార్యలు తమ భర్తల ఆరోగ్య విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారు కనుక, వారి బాధ తట్టుకోలేక అయినా భర్తలు తరచుగా పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారట. ఐదు సంవత్సరాల పాటు 1,228 మంది పెళ్లయిన స్త్రీ పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 57 నుండి 85 సంవత్సరాల మధ్య వయసున్న వారిని అధ్యయనానికి ఎంపిక చేసుకున్నారు. అధ్యయనం పూర్తయ్యే సరికి వీరిలో 389మందికి మధుమేహం వచ్చింది. చిత్రంగా ఎవరైతే తమది అన్యోన్య దాంపత్యం కాదని భావిస్తున్నారో వారిలో మధుమేహం రాగల అవకాశాలు తక్కువగా ఉండటం, ఒకవేళ వ్యాధి వచ్చినా దాన్ని వారు చాలా బాగా నియంత్రణలో ఉంచుకోవటం గమనించారు. ఇందుకు వ్యతిరేకంగా మంచి వివాహ బంధంలో ఉన్న మహిళలకు మధుమేహం వచ్చే రిస్క్ తక్కువగా ఉండటం గుర్తించారు. మహిళలకు మంచి వైవాహిక బంధం ఆరోగ్యంగా ఉండే స్ఫూర్తిని ఇస్తుందని మగవారికి మంచి మాటలతో కాకుండా అలా సతాయించి, పోరుపెడితేనే అర్థమవుతుందని ల్యూ చెబుతున్నాడు.