కిడ్నాపుల్లో గుంటూరు ఫస్ట్‌, సీమ జిల్లా లాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నాపుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. పోలీస్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యంగా చిన్నారుల కిడ్నాపులు అధికంగా ఉన్నాయి. ఇవి రానురాను పెరుగుతూనే ఉన్నాయి తప్పా తగ్గడం లేదు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 3వేల 594 మంది బాలబాలికలు కిడ్నాప్‌ అయినట్టు రికార్డులు చెబుతున్నారు. వారిలో కొందరు అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. వీటిని నిరోధించడంపై పోలీసు వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిడ్నాప్‌ కేసుల్లో గుంటూరు జిల్లా మూడేళ్లుగా మొదటిస్థానంలో ఉంది. […]

Advertisement
Update:2016-05-26 04:42 IST

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నాపుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. పోలీస్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యంగా చిన్నారుల కిడ్నాపులు అధికంగా ఉన్నాయి. ఇవి రానురాను పెరుగుతూనే ఉన్నాయి తప్పా తగ్గడం లేదు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 3వేల 594 మంది బాలబాలికలు కిడ్నాప్‌ అయినట్టు రికార్డులు చెబుతున్నారు. వారిలో కొందరు అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. వీటిని నిరోధించడంపై పోలీసు వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిడ్నాప్‌ కేసుల్లో గుంటూరు జిల్లా మూడేళ్లుగా మొదటిస్థానంలో ఉంది. 2014లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 210 కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. 2015లో 235 కేసులు నమోదయ్యాయి. 2016 ఏప్రిల్‌ వరకు 54 కిడ్నాప్‌ కేసులు నమోదైనట్లు పోలీస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కర్నూలు జిల్లా కిడ్నాప్ నేరాల్లో చివరి స్థానంలో ఉంది.

జిల్లాలవారీగా కిడ్నాప్ కేసు వివరాలు చూస్తే…

……………………2014 2015 2016

గుంటూరు – 210 235 54
కృష్ణా- 166 185 39
విజయనగరం 124 138 26
చిత్తూరు 106 145 18
ప్రకాశం 104 134 30
అనంతపురం 102 126 21
పశ్చిమగోదావరి 98 108 16
కడప 93 186 19
శ్రీకాకుళం 84 149 18
తూర్పుగోదావరి 72 98 26
విశాఖపట్నం 66 132 22
నెల్లూరు 98 136 13
కర్నూలు 74 99 09

సోర్స్… ప్రజాశక్తి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News