అమరావతికి ముంపు ముప్పు- ఈనాడు ఆసక్తికర కథనం

ఏపీ రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంపై మొదటి నుంచి కూడా నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.అందులో వరద ముంపు కూడా ఒకటి. భారీవర్షాలు వస్తే రాజధాని ప్రాంతం వరదలో చిక్కుకుంటుందని పలువురు హెచ్చరించారు. అయితే ప్రభుత్వ పెద్దలు వీటిని లెక్కచేయలేదు. తప్పుడు ప్రచారం అంటూ ఎదురుదాడి చేశారు. టీడీపీ సానుకూల మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేయకుండా జాగ్రత్తపడింది. అయితే తాజాగా ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం చర్చనీయాంశమైంది. రాజధాని […]

Advertisement
Update:2016-05-26 17:11 IST

ఏపీ రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంపై మొదటి నుంచి కూడా నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.అందులో వరద ముంపు కూడా ఒకటి. భారీవర్షాలు వస్తే రాజధాని ప్రాంతం వరదలో చిక్కుకుంటుందని పలువురు హెచ్చరించారు. అయితే ప్రభుత్వ పెద్దలు వీటిని లెక్కచేయలేదు. తప్పుడు ప్రచారం అంటూ ఎదురుదాడి చేశారు. టీడీపీ సానుకూల మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేయకుండా జాగ్రత్తపడింది. అయితే తాజాగా ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం చర్చనీయాంశమైంది.

రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు వరద వల్ల 13 వేల 500 ఎకరాలు ముంపులో చిక్కుకుంటుందని ఈనాడు కథనం. 5నుంచి 7రోజుల వరకు ఈనీరు అలాగే ఉండే అవకాశం ఉంటుందని రాశారు. అమరావతి నగరంలోని కోర్ క్యాపిటల్‌లో ఏకంగా 10 వేల 600 ఎకరాలు ముంపులో ఉంటుందని ఒకఅంచనా అంటూ ఈనాడు పత్రిక రాసింది. అంతే కాదు ప్రతి ఏటా మూడు సార్లు రాజధాని ప్రాంతం వరద ముంపులో చిక్కుకుంటుందని గణాంకాలే చెబుతున్నాయని వెల్లడించింది.

తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్న వెలగపూడి కూడా వర్షం వస్తే ముంపులో చిక్కుకునే అవకాశం ఉందని ఈనాడు పత్రికలో కథనం. పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు ఈ ఏడాది భారీ వర్షం వస్తే వెలగపూడి భవనాల పరిస్థితి ఏమిటన్నదానిపై అధికారులతో చర్చించినట్టు అదే పత్రిక వెల్లడించింది. అదే సమావేశంలో ఒక విచిత్రమైన నిర్ణయమే తీసుకున్నారు. అదేదో సాగునీటి కోసం ఎత్తిపోతల పథకం పెట్టినట్టు రాజధాని ముంపు నివారణకు ఎత్తిపోతలను ఆశ్రయించాలని నిర్ణయించారు.

ఈఏడాది కొండవీటి వాగుకు వరద వస్తే ఉండవల్లి నుంచి బ్యారేజ్‌లోకి పంపుల సాయంతో నీటిని ఎత్తిపోయడం ఒకటే మార్గమని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై నివేదికలుసిద్ధం చేస్తున్నారని ఈనాడు పత్రిక వెల్లడించింది. ఇందుకు ఈ ఏడాదికే దాదాపు రూ.200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు ఈనాడు వెల్లడించింది. దీనిపై ఇప్పుడు అధికారవర్గాల్లోనే తీవ్రచర్చ జరుగుతోంది. రాజధానిని ఇలా నీటి పంపుల సాయంతో రక్షించడం సాధ్యమా అని ప్రశ్నించుకుంటున్నారు. రోశయ్య సీఎంగా ఉన్నసమయంలో కృష్టాకు వరద వచ్చినట్టు వరద వస్తే నిరోధించడం సాధ్యమా అని ఆందోళన చెందుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News