ఆ పని చేసి ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయగలరా?

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో పార్టీల్లో సందడి మొదలైంది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పేరు ఖరారైంది. గురువారం ఆయన నామినేషన్ వేస్తారని సమాచారం. అయితే టీడీపీ నుంచి ఆశావహుల లిస్ట్‌ చాలా పెద్దగానే ఉంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీకి మూడుస్థానాలు దక్కనున్నాయి. అయితే వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ప్రలోభాల్లో భాగంగా చేర్చుకున్న టీడీపీ… రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై తర్జనభర్జన పడుతోంది. టీడీపీ నాలుగో స్థానం గెలుచుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు అసాధ్యమే. […]

Advertisement
Update:2016-05-25 06:38 IST

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో పార్టీల్లో సందడి మొదలైంది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పేరు ఖరారైంది. గురువారం ఆయన నామినేషన్ వేస్తారని సమాచారం. అయితే టీడీపీ నుంచి ఆశావహుల లిస్ట్‌ చాలా పెద్దగానే ఉంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీకి మూడుస్థానాలు దక్కనున్నాయి. అయితే వైసీపీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ప్రలోభాల్లో భాగంగా చేర్చుకున్న టీడీపీ… రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై తర్జనభర్జన పడుతోంది.

టీడీపీ నాలుగో స్థానం గెలుచుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు అసాధ్యమే. మరో 17 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి లాగితేగానీ నాలుగో స్థానం గెలవడం సాధ్యం కాదు. అయితే కొందరు పారిశ్రామికవేత్తలు టీడీపీ తరపున బరిలో దిగేందుకు ఆసక్తిచూపుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, టీజీ వెంకటేష్ లాంటి బడాబాబులు నాలుగోస్థానం నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

టికెట్ ఇస్తే మిగిలిన ఎమ్మెల్యేలను రాబట్టుకునే పని తాము చేసుకుంటామని చెబుతున్నారట. అయితే పారిశ్రామికవేత్తలు ఈ పనిచేయగలరా అన్నఅనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబును, తమ దగ్గర ఉన్న కోట్లరూపాయల సొమ్మును చూసుకుని వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేసినా,ఒకవేళ నాలుగో స్థానం నుంచి పారిశ్రామికవేత్తలు గెలిచినా అసలు సినిమా ఆ తర్వాత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు తిరిగి అధికారంలోకి వస్తారో లేదో ఎవరికీ తెలియదు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోయి జగన్‌ అధికారంలోకి వస్తే?. అప్పుడు ఈ పారిశ్రామికవేత్తల పరిస్థితి ఏమవుతోందో ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుతానికి అధికారం లేదు కాబట్టి తన పార్టీ ఎమ్మెల్యేలను డబ్బున్న పారిశ్రామికవేత్తలు బాబు అండతో కొనుగోలు చేసినా జగన్ ఏమీ చేయలేకపోవచ్చంటున్నారు. అయితే తర్వాత జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు ఏపీలో దుకాణం మూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో తమ వ్యాపార సామ్రాజ్యాలను కుప్పకూల్చుకుని రోడ్డున పడాలన్న ఆలోచన ఉన్న పారిశ్రామికవేత్తలే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను కొని, రాజ్యసభకు పోటీపడాల్సి ఉంటుందంటున్నారు. చూడాలి అంత సాహసం ఏ పారిశ్రామికవేత్త చేస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News