ప్రైవేట్ కాలేజీలకు "నీట్"... ప్రభుత్వ కాలేజీలకు "ఎంసెట్"
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెడికల్ ఎంట్రెన్స్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీని ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నీట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే అడ్మీషన్లు జరపవలసి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కావాలనుకుంటే నీట్‌కు వెళ్ళవచ్చు లేదా ఎంసెట్‌ను నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సీటీలు అన్నీ నేషనల్ ఎల్జిబులిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఎగ్జామ్‌కు తప్పక హాజరు కావాల్సిందేనని ఆ మార్కుల ఆధారంగానే అడ్మీషన్లు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు […]
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెడికల్ ఎంట్రెన్స్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీని ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నీట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే అడ్మీషన్లు జరపవలసి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కావాలనుకుంటే నీట్‌కు వెళ్ళవచ్చు లేదా ఎంసెట్‌ను నిర్వహించుకోవచ్చు.
ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సీటీలు అన్నీ నేషనల్ ఎల్జిబులిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఎగ్జామ్‌కు తప్పక హాజరు కావాల్సిందేనని ఆ మార్కుల ఆధారంగానే అడ్మీషన్లు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును 15 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ సిలబస్‌లు వుండడం, ప్రాంతీయ భాషల్లో చదువుకోవడం వల్ల ఇంగ్లీష్, హీందీలలో మాత్రమే జరిగే నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కష్టమని, దాని వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులు నష్టపోతారని 15 రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి.
దాంతో కేంద్రప్రభుత్వం ఈ ఏడాదికి నీట్‌ను వాయిదావేయాలని వచ్చే ఏడాదినుంచి ప్రాంతీయ భాషల్లోనూ “నీట్” పరీక్ష నిర్వహించాలని నిర్ణయించి సుప్రీం కోర్టు తీర్పును తోసి రాజంటూ అర్డినెన్స్‌ను జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ సంతకం చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నీట్ పరీక్ష ఆధారంగానే అడ్మీషన్లు జరపవలసి వుంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్ ఆధారంగా కానీ, నీట్ ఆధారంగా కానీ అడ్మీషన్లు జరపవలసి ఉంటుంది.