కమ్మ భవనాలకు కాపు పేరు పెట్టగలరా? మీ తాలూకు రక్తం ఎక్కించుకోవాలని ఆదేశాలిస్తారా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విరుచుకుపడ్డారు. ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టాలన్న నిర్ణయంపై మండిపడ్డారు. కమ్మ భవనాలకు కాపు భవన్ అని పేరు పెట్టగలరా అని ప్రశ్నించారు. కాపులు ఇళ్లకు, వాహనాలకు కూడా చంద్రన్న పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. పుట్టే పిల్లలకు కూడా చంద్రబాబు పేరు పెట్టుకోవాలన్న ఆదేశాలు జారీ చేస్తారేమోనని అనుమానం […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విరుచుకుపడ్డారు. ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టాలన్న నిర్ణయంపై మండిపడ్డారు. కమ్మ భవనాలకు కాపు భవన్ అని పేరు పెట్టగలరా అని ప్రశ్నించారు.
కాపులు ఇళ్లకు, వాహనాలకు కూడా చంద్రన్న పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. పుట్టే పిల్లలకు కూడా చంద్రబాబు పేరు పెట్టుకోవాలన్న ఆదేశాలు జారీ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు కాపులంతా తమ తాలూకు రక్తం ఎక్కించుకోవాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చేలా ఉన్నారని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చే జీతాలను కూడా చంద్రన్న జీతాల పేరుతో ఇస్తారేమోనన్నారు.
కాపులపై టన్నుల కొద్ది వరాలు కురిపిస్తున్న చంద్రబాబు… కాపుల రిజర్వేషన్ అంశం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాపు రుణాలను కూడా పచ్చచొక్కాలు వేసుకున్న వారికే ఇస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. కాపుల కోసం విరాళాలు కోరుతున్నారని… అంటే కాపులను ముష్టివాళ్లుగా చంద్రబాబు భావిస్తున్నారా అని ముద్రగడ ప్రశ్నించారు. కాపులు పన్నులు కట్టడం లేదా అని ప్రశ్నించారు. వాటి నుంచే కాపులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తానో దానకర్ణుడినని చెప్పుకుని తిరగడం సరికాదన్నారు.
Click on Image to Read: