కొట్టుకున్న కొత్తపల్లి, నాయుడు వర్గం

ప్రశాంతంగా సాగిపోతున్న పార్టీలో చంద్రబాబు ప్రోత్సహిస్తున్న వలసలు కొరివిపెడుతున్నాయి. శనివారం ఒంగోలులో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయులు మినీ మహానాడులో కొట్టుకోగా.. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. నరసాపురం టీడీపీ నియోజకవర్గ సమావేశంలో నరసాపురంఎమ్మెల్యే మాధవనాయుడు, వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గీయులు  కొట్టుకున్నారు. సమావేశం ప్రారంభం కాగానే కొత్తపల్లి చేరికకు వ్యతిరేకంగా మాధవనాయుడు వర్గీయులు నినాదాలు చేశారు. కొత్తపల్లి వర్గీయులు కూడా […]

Advertisement
Update:2016-05-22 15:39 IST

ప్రశాంతంగా సాగిపోతున్న పార్టీలో చంద్రబాబు ప్రోత్సహిస్తున్న వలసలు కొరివిపెడుతున్నాయి. శనివారం ఒంగోలులో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయులు మినీ మహానాడులో కొట్టుకోగా.. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. నరసాపురం టీడీపీ నియోజకవర్గ సమావేశంలో నరసాపురంఎమ్మెల్యే మాధవనాయుడు, వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గీయులు కొట్టుకున్నారు.

సమావేశం ప్రారంభం కాగానే కొత్తపల్లి చేరికకు వ్యతిరేకంగా మాధవనాయుడు వర్గీయులు నినాదాలు చేశారు. కొత్తపల్లి వర్గీయులు కూడా ప్రతినినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సమావేశం అదుపు తప్పింది. ఇరువర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరూ లెక్కచేయలేదు. దీంతో ఆమె ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొత్తపల్లి సుబ్బరాయుడు తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు.

కొత్తపల్లి తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. మాధవనాయుడు కూడా సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మాధవనాయుడు అసంతృప్తితో జిల్లా నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తపల్లి రాకను ఎమ్మెల్యే మాధవనాయుడు తొలి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేరే కార్యక్రమానికి రావాల్సిందిగా కొత్తపల్లి ఇటీవల స్వయంగా వెళ్లి నాయుడిని ఆహ్వానించారు. అయితే మీరు వెళ్లి పార్టీలో చేరండి… ఎలా వ్యవహరించాలో తాము తర్వాత నిర్ణయించుకుంటాం అని మాధవనాయుడు గట్టిగానే బదులిచ్చారు. ప్రశాంతంగా సాగుతున్న పార్టీలోకి అనవసరంగా ఇతర పార్టీ నేతలను తీసుకువచ్చి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News