కాపు నేతల వార్నింగ్‌తో వెనక్కు తగ్గిన సీఎం, ఉత్తర్వులు జారీ

కాపు భవనాలకు తన పేరు పెట్టుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంపై వారం రోజులుగా రచ్చ సాగుతోంది. తమ కుల భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడం ఏమిటని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కాపు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు కుల భవనాలకు కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు పేరు పెట్టడం ద్వారా ఏం సంకేతాలను పంపుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ఆదివారం ఉదయం కాపు నేతలు..  చంద్రబాబును కలిసి […]

Advertisement
Update:2016-05-22 10:00 IST

కాపు భవనాలకు తన పేరు పెట్టుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంపై వారం రోజులుగా రచ్చ సాగుతోంది. తమ కుల భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడం ఏమిటని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కాపు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు కుల భవనాలకు కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు పేరు పెట్టడం ద్వారా ఏం సంకేతాలను పంపుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ఆదివారం ఉదయం కాపు నేతలు.. చంద్రబాబును కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాపు భవనాలకు మీ పేరు పెట్టుకుంటే కాపుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని .. కాబట్టి కాపు నాయకుల పేర్లే భవనాలకు పెట్టాలని సూచించారు. లేకుంటే కాపులంతా టీడీపీకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉందన్నారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెడితే తప్పేంటి అని ప్రశ్నించిన బోండా ఉమాపైనా కాపు నేతలు మండిపడ్డారు. పెద్దల వద్ద పలుకుబడి సాధించేందుకు ఇలా కుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలు ఇలా నేరుగా వచ్చి కాపు భవనాలకు ”మీ పేరు పెట్టవద్దు” అని కోరే సరికి చంద్రబాబు కూడా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సీఎం ఈ విషయం తనకు తెలియకుండానే జరిగిందన్న భావన కలిగించే ప్రయత్నం చేశారు.

అందుకు తగ్గట్టుగానే కాపు నేతలు కలిసి వెళ్లిన కొద్ది సేపటికే సీఎంవో నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాపు భవనాలకు సీఎంను సంప్రదించకుండా పేర్లు పెట్టవద్దని ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చేయడం ద్వారా చంద్రబాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందన్న భావన కలిగించేందుకు సీఎంవో ప్రయత్నించింది. అయినా వారం రోజుల నుంచి కాపు భవనాలకు బాబుపేరుపై రచ్చ జరుగుతోంది. నిత్యం పత్రికల్లో ఈ అంశం ప్రముఖంగా వస్తోంది. అయినా ఇదంతా చంద్రబాబుకు తెలియదంటే ఎలా నమ్మగలం?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News