ప్రకృతి, పవన్ కల్యాణ్, విజయకాంత్

ప్రతి వ్యక్తికి ప్రకృతి కొద్దిగా శక్తిని ఇస్తుంది. ల‌క్షాల‌ది మందిని ఆక‌ర్శించే శ‌క్తి కూడా అందులో ఒక‌టి. అయితే ఆ ప‌వ‌ర్‌ను ఎలా ఉప‌యోగించుకుంటార‌న్న దాని బ‌ట్టే స‌ద‌రు వ్య‌క్తి ఎదుగుద‌ల ఆధార‌ప‌డి ఉంటుంది. హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అలా జ‌నాన్ని ఆక‌ర్శించే శ‌క్తి ఉండేది.. ఇప్పుడు ఉంది కూడా. త‌మిళ‌నాడులో విజ‌య‌కాంత్ ఘోరంగా ఓడిపోయారు. చివ‌ర‌కు తాను కూడా స్వ‌యంగా డిపాజిట్లు సాధించలేనంత దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు విజ‌య‌కాంత్‌ను చూసిన వారు మ‌రో చిరంజీవి […]

Advertisement
Update:2016-05-21 04:30 IST

ప్రతి వ్యక్తికి ప్రకృతి కొద్దిగా శక్తిని ఇస్తుంది. ల‌క్షాల‌ది మందిని ఆక‌ర్శించే శ‌క్తి కూడా అందులో ఒక‌టి. అయితే ఆ ప‌వ‌ర్‌ను ఎలా ఉప‌యోగించుకుంటార‌న్న దాని బ‌ట్టే స‌ద‌రు వ్య‌క్తి ఎదుగుద‌ల ఆధార‌ప‌డి ఉంటుంది. హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అలా జ‌నాన్ని ఆక‌ర్శించే శ‌క్తి ఉండేది.. ఇప్పుడు ఉంది కూడా.

త‌మిళ‌నాడులో విజ‌య‌కాంత్ ఘోరంగా ఓడిపోయారు. చివ‌ర‌కు తాను కూడా స్వ‌యంగా డిపాజిట్లు సాధించలేనంత దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు విజ‌య‌కాంత్‌ను చూసిన వారు మ‌రో చిరంజీవి అంటున్నారు. నిజ‌మే అచ్చం చిరంజీవి త‌ర‌హాలో కాక‌పోయినా ఆయ‌న త‌ర‌హాలోనే విజ‌య‌కాంత్ దెబ్బ‌తిన్నారు. ఎమ్మెల్యేగా చిరు కూడా పాల‌కొల్లులో ఓడిపోయారు. విజ‌య‌కాంత్‌ను మ‌రో చిరు అన‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కూడా మ‌రో విజ‌య‌కాంత్ అంటారేమో. ఎందుకంటే ప‌వ‌న్ జనంలో త‌న‌కున్న ప‌వ‌ర్‌ను ఆల్‌రెడీ వాడేశారు. అది కూడా త‌న కోసం కాదు. చంద్ర‌బాబు కోసం. అందుకే జ‌నంలో ప‌వ‌న్ మీద రాజ‌కీయంగా ఇది వ‌ర‌కు ఉన్నంత ఆస‌క్తి లేదు.

ప్ర‌కృతి త‌న‌కు ప్ర‌సాదించిన శ‌క్తిని బాబు గారి కోసం ప‌వ‌న్ ధార పోశారు. పైగా చంద్ర‌బాబును తిట్టాల్సి వ‌చ్చిన ప్ర‌తిసారి రైతులు, మ‌హిళ‌లు, యువ‌కులు … ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కూడా తిడుతున్నారు. ఈయ‌న మాట‌లు వినే టీడీపీకి ఓటేసి నాశ‌నం అయ్యామంటూ కొంద‌రు ర‌గిలిపోతున్నారు. అంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను చంద్ర‌బాబుతో పాటు ప‌వ‌న్ కూడా మోస్తున్నారు. ఎన్నిక‌ల‌కు తీరా ఏడాది, ఆరు నెల‌ల ముందు బ‌రిలో దూకి హ‌డావుడి చేసి ఎన్టీఆర్ త‌ర‌హాలో సీఎం అయిపోదామ‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉండ‌వ‌చ్చు. కానీ ఆ ప్ర‌యోగం అన్న చిరు విష‌యంలోనే ఎంత‌గా బెడిసికొట్టిందో త‌మ్ముడికి గుర్తే ఉంటుంది.

సినిమా వాళ్లు అంటే ప‌డి చ‌చ్చే త‌మిళ‌నాడులోనే విజ‌య‌కాంత్‌కు డిపాజిట్లు రాలేదంటే… ఇక ఏపీలో సినిమా వాళ్ల ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. విజ‌య‌కాంత్‌కు నోటీ దూల‌ ఉంది. ప‌వ‌న్‌కు అది ఆ రేంజ్ లో లేదు. కానీ ఒక ప్రెస్‌మీట్‌కు మ‌రో ప్రెస్‌మీట్‌కు అభిప్రాయం మార్చుకునే గుణ‌మైతే ఉంది. అది కూడా ప్ర‌మాద‌మే. మొత్తం విజ‌య‌కాంత్‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన తీరును చూసిన త‌ర్వాత త‌ప్ప‌కుండా ప‌వ‌న్ త‌న రాజ‌కీయ ప్ర‌యాణంపై వెనకాముందు వంద‌సార్లు ఆలోచించుకోవాల్సిందే. బాబు కోసం ఖ‌ర్చు చేసిన త‌న‌లోని శ‌క్తిని తిరిగి పొందాలంటే ప‌వ‌న్ పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్‌లా కాకుండా ఫుల్‌టైమ్ పొలిటీషియ‌న్‌గా మారాలి. భ‌విష్య‌త్తులో ప‌వ‌న్‌ను చూసిన వారు మ‌రో విజ‌య‌కాంత్ అన‌కుండా ఉండాలంటే సినీ గ్లామ‌ర్‌, ఎన్నిక‌ల ముందు ఎంట్రీ లాంటి ఆలోచ‌న‌ల‌ను మానుకుని ఇప్ప‌టినుంచే ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంది. (త‌మిళ ప్ర‌జ‌లు ఇచ్చిన ఫ‌లితం దెబ్బ‌కు ప్రస్తుతానికి తాను సినిమాలు తీసుకుంటాన‌ని విజ‌య‌కాంత్ ట్వీట్ చేశారు).

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News