ఇదేమీ ఆత్మగౌరవం బోండా..
రాష్ట్రంలో కాపు భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే వాటికి చంద్రన్న కాపు భవనాలు అని పేరు పెడుతామంటూ ప్రభుత్వం చెప్పడం వివాదాస్పదమవుతోంది. టీడీపీనేత కాపులు బాబు నిర్ణయంపై భగ్గుమంటున్నారు. తమ భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం కాపులను కించపరచడమేంటున్నారు. కాపుల్లో కోడి రాంమూర్తి, ఎస్వీ రంగారావు, వంగవీటి రంగా, నటి సావిత్రి వంటి ఎందరో మహానుభావులుండగా చంద్రబాబు పేరు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకేంటని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటిరాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పేరు పెట్టుకుని […]
రాష్ట్రంలో కాపు భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే వాటికి చంద్రన్న కాపు భవనాలు అని పేరు పెడుతామంటూ ప్రభుత్వం చెప్పడం వివాదాస్పదమవుతోంది. టీడీపీనేత కాపులు బాబు నిర్ణయంపై భగ్గుమంటున్నారు. తమ భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం కాపులను కించపరచడమేంటున్నారు. కాపుల్లో కోడి రాంమూర్తి, ఎస్వీ రంగారావు, వంగవీటి రంగా, నటి సావిత్రి వంటి ఎందరో మహానుభావులుండగా చంద్రబాబు పేరు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకేంటని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటిరాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పేరు పెట్టుకుని ఆ భవనాల్లో కాపులు పెళ్లిళ్లు చేసుకోవాలా అని ప్రశ్నించారు.
కాపులను చంద్రబాబు తన బానిసల్లా చూస్తూ అవమానిస్తున్నారని మిగిలిన కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కాపు నేతలే కాదు సామాన్యులు కూడా చంద్రబాబు నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్నారు. కాపుల భవనాలకు కమ్మసామాజికవర్గానికి చెందిన చంద్రబాబు పేరు పెట్టడం విచిత్రంగానే ఉందంటున్నారు. అయితే కాపులు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నా టీడీపీలోని చంద్రబాబు అభిమాన కాపు నేతలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చంద్రబాబుపై ఈగవాలినా సహించలేని కాపు నేత బొండా ఉమా ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించారు. కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడాన్ని బోండా ఉమా సమర్థించడాన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. అయినా ఒక కులం పేరు మీద నిర్మిస్తున్న భవనాలకు మరో కులానికి చెందిన నేత పెట్టాలన్న ఆలోచన రావడమే ఆశ్చర్యంగా ఉంది.
Click on Image to Read: