మూడు చీక‌టి జీవోలు జారీ... 838 ఎక‌రాలు

ఏపీలో భూపందేరాలు శ‌ర‌వేగంగా జ‌రిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే జీవోలు వ‌చ్చేస్తున్నాయి. అభ్యంత‌రాలు చెప్పినా ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నా స‌రే భూములు పంచేస్తున్నారు. తాజాగా మూడు జీవోల‌ను చీక‌టి ప‌డ్డాక రాత్రి వేళ‌ల్లో విడుద‌ల చేశారు. ఈ జీవోల విలువ 838ఎక‌రాలు. కోట్ల విలువైన ఈ భూముల‌ను కేవ‌లం నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు క‌ట్ట‌బెట్టేశారు. మ‌రో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే… ఈ భూములు లీజే కాదు స‌ద‌రు సంస్థ‌లు కావాలంటే అమ్మేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం. క‌ర్నూలు జిల్లా తంగెదంచెలో […]

Advertisement
Update:2016-05-20 05:10 IST

ఏపీలో భూపందేరాలు శ‌ర‌వేగంగా జ‌రిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే జీవోలు వ‌చ్చేస్తున్నాయి. అభ్యంత‌రాలు చెప్పినా ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నా స‌రే భూములు పంచేస్తున్నారు. తాజాగా మూడు జీవోల‌ను చీక‌టి ప‌డ్డాక రాత్రి వేళ‌ల్లో విడుద‌ల చేశారు. ఈ జీవోల విలువ 838ఎక‌రాలు. కోట్ల విలువైన ఈ భూముల‌ను కేవ‌లం నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు క‌ట్ట‌బెట్టేశారు. మ‌రో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే… ఈ భూములు లీజే కాదు స‌ద‌రు సంస్థ‌లు కావాలంటే అమ్మేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

క‌ర్నూలు జిల్లా తంగెదంచెలో ఉద్యాన‌వ‌న పార్కు ఏర్పాటు చేస్తామంటూ జైన్ ఇరిగేష‌న్ సిస్ట‌మ్స్ లిమిటెడ్ 2014లో ద‌ర‌ఖాస్తు చేసుకుంది. కానీ ప్రాజెక్టు నివేదిక‌లో లోపాల‌ను గుర్తించిన అధికారులు ఆ ఫైల్‌ను ప‌క్క‌న‌ప‌డేశారు. కానీ లోలోప‌ల ఏం జ‌రిగిందో గానీ స‌ద‌రు సంస్థ‌కు భూములు అప్ప‌గించాల్సిందేన‌ని పెద్ద‌ల నుంచి ఒత్తిడి వ‌చ్చింది. అంతే ఏకంగా 632. 40 ఎక‌రాల‌ను క‌ట్టబెడుతూ జీవో విడుద‌లైంది. ఈ భూమిని స‌ద‌రు సంస్థ కావాల్సిన‌ప్పుడు అమ్ముకోవ‌చ్చు.

కర్నూలు జిల్లాలోని తంగెదంచె గ్రామంలోనే అంబుజా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ‌కు 200 ఎక‌రాలు క‌ట్ట‌బెట్టారు. ఈ భూమిలో మొక్క‌జొన్న శుద్ది కేంద్రం ఏర్పాటు చేస్తార‌ట‌. 200 ఎక‌రాలు భూమి అంటే భారీ ప్రాజెక్ట్ అనుకుంటే పొర‌పాటే. ఈ శుద్ది కేంద్రం వ‌ల్ల వ‌చ్చేది కేవ‌లం 500ల ఉద్యోగాలు మాత్ర‌మే. ఆ విష‌యాన్ని స‌ద‌రు సంస్థే స్వ‌యంగా చెప్పింది.

గుంటూరు జిల్లా పొత్తూరులోని ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులో ప్రిజ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌కు 15 ఎక‌రాలు కేటాయించారు. కోట్లాది రూపాయ‌ల విలువైన ఈ భూమిని త‌క్కువ ధ‌ర‌కే క‌ట్ట‌బెడుతూ జీవోలు విడుద‌ల చేశారు. ఇలా భూకేటాయింపులు జ‌ర‌గ‌డం వెనుక పెద్ద‌త‌తంగ‌మే న‌డిచింద‌ని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News