మరో దీక్షకు జగన్ ప్రకటన

తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా మూడు రోజుల పాటు క‌ర్నూలులో చేప‌ట్టిన జ‌గ‌న్ జ‌ల‌దీక్ష ముగిసింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌న్ మునుముందు కూడా ఈ పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. మ‌రో నెల రెండు నెల‌లు చూస్తామ‌ని ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోతే మ‌రోసారి దీక్ష చేస్తాన‌ని చెప్పారు. ఈ సారి గోదావ‌రి జ‌లాల కోసం ధీక్ష ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు మ‌న సీఎం అని చెప్పుకోవ‌డానికి అంద‌రూ సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. కేసీఆర్‌ను నిల‌దీస్తే ఓటుకు నోటు కేసు బ‌య‌ట‌కు […]

Advertisement
Update:2016-05-18 10:04 IST

తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా మూడు రోజుల పాటు క‌ర్నూలులో చేప‌ట్టిన జ‌గ‌న్ జ‌ల‌దీక్ష ముగిసింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌న్ మునుముందు కూడా ఈ పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. మ‌రో నెల రెండు నెల‌లు చూస్తామ‌ని ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోతే మ‌రోసారి దీక్ష చేస్తాన‌ని చెప్పారు. ఈ సారి గోదావ‌రి జ‌లాల కోసం ధీక్ష ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు మ‌న సీఎం అని చెప్పుకోవ‌డానికి అంద‌రూ సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. కేసీఆర్‌ను నిల‌దీస్తే ఓటుకు నోటు కేసు బ‌య‌ట‌కు తీస్తార‌ని భ‌యం, మోదీని నిల‌దీస్తే 24 నెల‌ల్లో జ‌రిగిన అవినీతిపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తార‌ని చంద్ర‌బాబుకు భ‌యం అని జ‌గ‌న్ ఆరోపించారు. అస‌లు చంద్ర‌బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లాడో కూడా అర్థంర కావ‌డం లేద‌న్నారు.

తెలంగాణ ప్రాజెక్టుల‌పై ప్ర‌శ్నిస్తే అన్ని అనుమ‌తులు తీసుకున్న త‌ర్వాతే ప్రాజెక్టులు నిర్మించాల‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని.. మ‌రి ఎలాంటి అనుమ‌తులు లేకుండానే తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టులు క‌డుతుంటే ఈయ‌నేం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో తాగేందుకు నీళ్లు కూడా లేక జ‌నం అల్లాడిపోతుంటే చంద్ర‌బాబు మాత్రం నీరో చ‌క్ర‌వ‌ర్తిలాగా ఫిడేల్ వాయిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల వ‌ల్ల రాయ‌ల‌సీమ‌, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాలు ఎడారిగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు. గోదావ‌రి న‌ది నుంచి రోజుకు 70 వేల క్కూసెక్కుల నీటిని తోడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని అదే జ‌రిగితే గోదావ‌రి డెల్టా భూములు బంజ‌రు భూములుగా మారుతాయ‌ని జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News