ఆ ఫోన్ కాల్‌కు ఉలిక్కిపడుతున్న దేవినేని ఉమా
తెలుగు రాష్ర్టాల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తిస్తోన్న పాలమూరు ప్రాజెక్టుపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలు ఈ వివాదంపై మాటల దాడి చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు వివాదాస్పదమని, అక్రమమని ఏపీ ఆరోపిస్తుండగా.. లేదు మాది కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టునే కొనసాగిస్తున్నామని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పొరుగు రాష్ర్టాలతో ఉన్న నీటి పంపకాల వివాదం పరిష్కరించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, […]
తెలుగు రాష్ర్టాల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తిస్తోన్న పాలమూరు ప్రాజెక్టుపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలు ఈ వివాదంపై మాటల దాడి చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు వివాదాస్పదమని, అక్రమమని ఏపీ ఆరోపిస్తుండగా.. లేదు మాది కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టునే కొనసాగిస్తున్నామని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పొరుగు రాష్ర్టాలతో ఉన్న నీటి పంపకాల వివాదం పరిష్కరించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో చర్చలు జరిపిన హరీశ్ వాటిని దాదాపుగా ఫలప్రదం చేశాడు. ఇదే బాటలో ఏపీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమాతోనూ చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఉమా మాత్రం హరీశ్ ఫోన్‌కాల్‌కు సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది.
బాబు ఆదేశాల మేరకేనా?
పాలమూరు ప్రాజెక్టు అక్రమమంటూ కర్నూలు ఆర్డీఓ కర్ణాటకకు లేఖరాసిన నేపథ్యంలో వివాదం మరింత పెరిగింది. దీనిపై ఏపీ కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. కానీ, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్చలకు మించిన పరిష్కారం ఏముంటుంది? అని సాగునీటిపారుదల నిపుణులు సైతం సూచిస్తున్నారు. చర్చలకు ఎందుకు వెనకాడుతున్నట్లు? అన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఉమా స్పందించకపోవడం వెనక చంద్రబాబు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే హరీశ్ ఫోన్‌కాల్‌ను ఆన్సర్ చేయడం లేదని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్ట్ జోలికి వెళ్లే చంద్రబాబుకు ఇష్టమైన పట్టిసీమ ప్రాజెక్ట్ అంశాన్ని తెలంగాణ లేవనెత్తవచ్చని బాబు, ఉమా భావిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన పట్టిసీమపై తెలంగాణ నిలదీస్తే బాబు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అందుకే హరీష్… కమాన్ చర్చిద్దాం రండి అని పదేపదే సూచిస్తున్నా దేవినేని ఉమ మాత్రం స్పందించడం లేదంటున్నారు. ఎటొచ్చి బాబు కాసుల కోసం నిర్మించుకున్న పట్టిసీమ కూడా ఇప్పుడు ఏపీని ఆత్మరక్షణలో పడేసేందుకు ఒక కారణమైందని చెబుతున్నారు. ఆ మధ్య పట్టిసీమ ఐడియా మంచిదేనని కేసీఆర్ అనడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పట్టిసీమ వల్ల తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులపై ప్రశ్నించే అర్హతను ఏపీ కోల్పోయిందని ఆ కోణంలోనే కేసీఆర్ పట్టిసీమ నిర్ణయాన్ని మెచ్చుకున్నారని చెబుతున్నారు.
దీనికి తోడు ఓటుకునోటు కేసు కేసీఆర్ చేతిలో ఉందని, అందుకే టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు టీడీపీ సాహసించడం లేదని చెబుతున్నారు. తామెందుకు మౌనంగా ఉంటున్నామనే విషయాన్ని టీడీపీ ఇంతవరకూ వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఇప్పటికైనా టీడీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని, ఈ విషయంలో తమ వైఖరి స్పష్టం చేయాలని సాగునీటిపారుదల నిపుణులు సూచిస్తున్నారు.
Click on Image to Read: