అడుక్కుతినే వాడు కాదు... పోరాడే వాడు కావాలి
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలయవుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అడుక్కుతినే సీఎం కాదని… పోరాడే వ్యక్తి కావాలని రఘువీరా అన్నారు. అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని మోదీ వద్ద చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని విమర్శించారు. కేసు కారణంగానే కేసీఆర్ ను చంద్రబాబు […]
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలయవుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అడుక్కుతినే సీఎం కాదని… పోరాడే వ్యక్తి కావాలని రఘువీరా అన్నారు. అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని మోదీ వద్ద చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని విమర్శించారు. కేసు కారణంగానే కేసీఆర్ ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలను వంచించినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు 15 రోజులుగా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు 33 ప్రశ్నలు సంధిస్తున్నాం.. సమాధానం చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. 2019లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం చేస్తారని రఘువీరా చెప్పడం విశేషం.
Click on Image to Read: