బాబు పేరు వద్దు...రంగా పేరు పెట్టాలని కాపుల డిమాండ్
కాపులు దూరమైతే ఎన్నికల్లో టీడీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే చంద్రబాబు తక్కువ ఖర్చుతోనే కాపులను దువ్వుతూ వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా తరతరాల పాటు కాపులు తన పేరు స్మరిస్తూ బతకాలన్న చంద్రబాబు ఉద్దేశమే వివాదాస్పదమవుతోంది. కాపుల ఫీలింగ్స్‌ను దెబ్బతీస్తోంది. కాపుల కోసం ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రకటించింది. విరివిగా రుణాలు మంజూరు చేయడంతో పాటు ఐదు చోట్ల కాపు భవనాలు నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకు మార్గదర్శకాలు విడుదల […]
కాపులు దూరమైతే ఎన్నికల్లో టీడీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే చంద్రబాబు తక్కువ ఖర్చుతోనే కాపులను దువ్వుతూ వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా తరతరాల పాటు కాపులు తన పేరు స్మరిస్తూ బతకాలన్న చంద్రబాబు ఉద్దేశమే వివాదాస్పదమవుతోంది. కాపుల ఫీలింగ్స్‌ను దెబ్బతీస్తోంది. కాపుల కోసం ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రకటించింది. విరివిగా రుణాలు మంజూరు చేయడంతో పాటు ఐదు చోట్ల కాపు భవనాలు నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే కాపుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా … కాపు భవన్‌లకు చంద్రన్న కాపు భవన్‌గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది.
అంటే ఇప్పటికే పదుల సంఖ్యలో పథకాలకు తన పేరు పెట్టుకున్న చంద్రబాబు… ఇప్పుడు కాపు కులం కోసం నిర్మిస్తున్న భవనాలకు కూడా తన పేరే పెట్టుకున్నారు. ఇలా చేయడం ద్వారా తరతరాల పాటు కాపులు… కాపు భవన్ పేరుతో తన నామస్మరణ చేస్తుంటారని సీఎం భావన. ఇలా ప్రతిసారి తన పేరును కాపులు స్మరించుకుంటూ గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఒక కులభవానికి కూడా ఆయన పేరు పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై టీడీపీయేతర కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుకు కాపు భవనాలకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందని చంద్రబాబు పేరును తమ భవనాలకు ఎలా పెడుతారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హోల్‌సేల్‌గా కాపులంతా తన బానిసలుగా ఫీల్ అవుతున్నట్టుగా ఉందని మండిపడుతున్నారు. కాపుల్లోనూ ఎంతో మంది గొప్పవారు ఉన్నారని కాబట్టి వారి పేర్లను కాపు భవనాలకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జనం కోసం పోరాటం చేస్తూ దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన వంగవీటి రంగా పేరును కాపు భవనాలకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని టీడీపీయేతర కాపు నేతలు సూచిస్తున్నారు. టీడీపీలోని కాపు నేతలు మాత్రం బాబు భజనకు సిద్ధమన్నట్టుగా మౌనంగా ఉన్నారు.
Click on Image to Read: