బాబు గుడ్డి పాలనకు ఈ ఫొటొయే నిదర్శనం

ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన పాలనలో పారదర్శకం అధికమని… అన్ని వర్గాలను సమదృష్టితో చూసే ఘనత తమదేనని చెబుతుంటారు. కానీ బాబు చెప్పేదానికి లోకల్‌లో జరిగే దానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో ఒక ఘటన చూస్తే రెండో అభిప్రాయమే కరెక్ట్ అనిపిస్తుంది. ఫించన్ల పంపిణీలో అధికారుల జోక్యాన్ని తగ్గించి వేసి జన్మభూమి కమిటీలపేరుతో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు అందలం ఎక్కించారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ తమ్ముళ్లు తమకు గిట్టనివారిపై […]

Advertisement
Update:2016-05-17 04:59 IST

ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన పాలనలో పారదర్శకం అధికమని… అన్ని వర్గాలను సమదృష్టితో చూసే ఘనత తమదేనని చెబుతుంటారు. కానీ బాబు చెప్పేదానికి లోకల్‌లో జరిగే దానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో ఒక ఘటన చూస్తే రెండో అభిప్రాయమే కరెక్ట్ అనిపిస్తుంది. ఫించన్ల పంపిణీలో అధికారుల జోక్యాన్ని తగ్గించి వేసి జన్మభూమి కమిటీలపేరుతో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు అందలం ఎక్కించారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ తమ్ముళ్లు తమకు గిట్టనివారిపై కక్ష సాధిస్తున్నారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నర్సింగోలు గ్రామానికి చెందిన 24 ఏళ్ల రఘుకు పోలియో కారణంగా చిన్నప్పుడే రెండు కాళ్లు పనిచేయకుండాపోయాయి. 90 శాతం అంగవైకల్యం ఉన్నట్టు వైద్యులు కూడా ధృవీకరించారు. రఘు వికలాంగుడా కాదా అన్నది నిర్దారించేందుకు డాక్టర్లు కూడా అవసరం లేదు కళ్లున్న ఎవడైనా చెబుతారు. కానీ ప్రభుత్వానికి మాత్రం కళ్లు మూసుకుపోయాయి. రఘు పించన్ కోసం రెండేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో రఘు విషయంలో ప్రభుత్వ తీరును చూసి ఆగ్రహించిన గ్రామస్తులు ఇలా మంచంలో జిల్లా కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు.

రఘుకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకున్న వారు అధికారులను, ప్రభుత్వాన్ని తిట్టని తిట్టులేదు. ప్రభుత్వానికి కళ్లు ఉన్నాయా… మూసుకుపోయాయా అని మండిపడుతున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ రఘుకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుని నోటికొచ్చినట్టు ప్రభుత్వాన్ని, అధికారులను తిట్టి వెళ్లారు. అలా కలెక్టరేట్ సాక్షిగా ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయింది. అయితే రఘుకు పించన్ రాకుండా అపడం వెనుక జన్మభూమి కమిటీ సభ్యుల కుట్ర ఉందని కొందరు అధికారులు అనుమానిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News