కాలజ్ఞానం నిజమయ్యేలా ఉంది

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జగన్‌ మూడు రోజుల దీక్ష మొదలుపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ …చంద్రబాబు,కేసీఆర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసుకు భయపడి కేసీఆర్‌ను నిలదీయడం లేదని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచాలని ప్రాజెక్ట్ నిర్మాణసమయంలోనే నిర్ణయించారని […]

Advertisement
Update:2016-05-16 07:50 IST

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జగన్‌ మూడు రోజుల దీక్ష మొదలుపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ …చంద్రబాబు,కేసీఆర్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసుకు భయపడి కేసీఆర్‌ను నిలదీయడం లేదని ఆరోపించారు.

శ్రీశైలం డ్యాంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచాలని ప్రాజెక్ట్ నిర్మాణసమయంలోనే నిర్ణయించారని కానీ చంద్రబాబు మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా 834 అడుగులకు తగ్గించారని జగన్‌ విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలు, దిండి ప్రాజెక్ట్ ద్వారా 120 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అదే జరిగితే రాయలసీమకు తాగేందుకు కూడా నీరుండవని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వాటా 954 టీఎంసీలని మిగిలిన నీరే ఏపీకి ఇస్తామని కేసీఆర్‌ చెబుతున్నారని జగన్ అన్నారు. అలా చెప్పడానికి నదీజలాలు ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు.

చంద్రబాబు మౌనంగా ఉంటూ ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను లాక్కున్నారు. ఇప్పుడు నీటిని కూడా లాగేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలా బతకాలని జగన్ ప్రశ్నించారు. కేసీఆర్‌ హిట్లర్‌లాగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రాబోయే కాలంలో నీటి యుద్ధాలు వస్తాయని కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పారని కేసీఆర్‌ తీరు చూస్తుంటే అది నిజమయ్యేలా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పరిస్థితులను భారత్, పాకిస్తాన్‌ సరిహద్దులా మారుస్తున్నారని విమర్శించారు. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు కంటే కేసీఆర్‌పైనానే ఘాటైన విమర్శలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News