రూ.570కోట్లపై స్పందించిన విశాల్

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ డబ్బుతో వస్తున్న మూడు కంటైనర్లను గుర్తించారు పోలీసులు. మూడు కంటైనర్లలో దాదాపు రూ. 570 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొయంబత్తూర్ నుంచి విశాఖకు ఈ కంటైనర్లు వస్తున్నట్టు వాటి డ్రైవర్లు వివరించారు. బ్యాంకు సొమ్ము అని వారు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. ఈ విషయంపై ప్రముఖ నటుడు, నడిగర్‌ సంఘం సభ్యుడు విశాల్‌ ట్విట్టర్లో స్పందించారు. ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికి నడిగర్‌ ఎన్నికల తరువాత […]

Advertisement
Update:2016-05-14 10:20 IST

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ డబ్బుతో వస్తున్న మూడు కంటైనర్లను గుర్తించారు పోలీసులు. మూడు కంటైనర్లలో దాదాపు రూ. 570 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొయంబత్తూర్ నుంచి విశాఖకు ఈ కంటైనర్లు వస్తున్నట్టు వాటి డ్రైవర్లు వివరించారు. బ్యాంకు సొమ్ము అని వారు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేదు.

ఈ విషయంపై ప్రముఖ నటుడు, నడిగర్‌ సంఘం సభ్యుడు విశాల్‌ ట్విట్టర్లో స్పందించారు. ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికి నడిగర్‌ ఎన్నికల తరువాత పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు విశాల్‌. తమిళనాడు వరదల సమయంలోనూ స్వయంగా సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన ఈ డబ్బును చిన్న పిల్లల చదువు, మధ్యాహ్న భోజన పథకాలకు వినియోగించాలంటూ ట్వట్టర్‌ లొ పోస్టు చేశారు విశాల్‌.

అయితే మరోవైపు డబ్బున్న కంటైనర్లను తమిళనాడు పోలీసులు ఆపగానే వాటివెంట వస్తున్న మూడు కార్లలోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమిళనాడు పోలీసులు కొంత దూరం వెంటాడి మూడు కార్లను పట్టుకున్నారు. తొలుత తాము ఏపీ పోలీసులమని కార్లలోనివారు చెప్పారు. పోలీసులైతే ఎందుకు పారిపోతున్నారంటూ తమిళపోలీసులు ప్రశ్నించగా దొంగలు వెంబడిస్తున్నారేమోనని భావించి పారిపోయేందుకు ప్రయత్నించామని వారు చెప్పారు. ఐడీ కార్డులు చూపించమని కోరగా అందుకు సదరు వ్యక్తులు సరైన సమాధానం చెప్పలేక పోయారని సమాచారం. విశాఖలోని ఎస్‌బిఐ బ్రాంచ్‌కు డబ్బు తరలిస్తున్నట్టు పట్టుబడినవారు చెప్పారు. అయితే ఇన్ని వందల కోట్లు తరలిస్తూ కూడా సరైన భద్రతా చర్యలు, సరైన డాక్యుమెంట్లు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత లోతుగా తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇది కొందరి బడాబాబుల సొమ్ము అయి ఉండవచ్చుననికూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News