బాబు హోదా రహస్యం బయటపెట్టిన బీజేపీ ఇన్‌చార్జ్
ప్రత్యేక హోదాపై బీజేపీని టీడీపీ టార్గెట్ చేయడంతో కమలనాథులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని చంద్రబాబు ఎందుకు చెప్పారని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తుండగా …ఇప్పుడు ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఆడుతున్న డబుల్ గేమ్‌ను బహిర్గతం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా చంద్రబాబు అడిగారా లేదా అన్నప్రశ్నకు ఇన్‌డైరెక్ట్ గానే అసలు విషయంచెప్పేశారు. ”చంద్రబాబు అడిగారా […]
ప్రత్యేక హోదాపై బీజేపీని టీడీపీ టార్గెట్ చేయడంతో కమలనాథులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని చంద్రబాబు ఎందుకు చెప్పారని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తుండగా …ఇప్పుడు ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఆడుతున్న డబుల్ గేమ్‌ను బహిర్గతం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా చంద్రబాబు అడిగారా లేదా అన్నప్రశ్నకు ఇన్‌డైరెక్ట్ గానే అసలు విషయంచెప్పేశారు. ”చంద్రబాబు అడిగారా లేదా అన్నది నా నోటి గుండా ఎందుకు చెప్పిస్తారు… మాది సంకీర్ణ ప్రభుత్వం, చంద్రబాబు ఏం అడిగారో అందరికీ తెలుసు. విభజన చట్టంలోని హామీలను మాత్రమే అమలు చేయాల్సిందిగా కోరారు” అని చెప్పారు.
కేంద్రం రాష్ట్రానికి అన్నివిధాలుగా ఆదుకుంటూ వివిధ ప్రాజెక్టులకోసం లక్షల కోట్లు ఇస్తున్నా కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సిద్దార్థనాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేంద్రం ఇచ్చిన నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా చంద్రబాబు ఏనాడు కూడా ప్రత్యేకహోదా కోసం ఆడగలేదని సిద్దార్థనాథ్ తేల్చిచెప్పారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు 70:30 నిష్పత్తిలో కేంద్రం నిధులు ఇస్తుందని కానీ ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉండబట్టే పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులను కేంద్రమే ఇస్తోందని విజయవాడ విలేఖరుల సమావేశంలో చెప్పారు సిద్దార్థనాథ్.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు చాలాసార్లు తేలిగ్గా మాట్లాడారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని చెప్పడం ద్వారా ప్రత్యేకహోదా ఆకాంక్షను చంద్రబాబే బలహీనపరిచారన్న భావన ఉంది. ముఖ్యమంత్రే ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న తర్వాత ఆ విషయంలో కేంద్రం కూడా నిర్లక్ష్యం వహించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Click on Image to Read: