అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం : మంత్రి గుమ్మిడి
అంగన్వాడీ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు
ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు. వారి సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. వారికి అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవలలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాల లోపు పిల్లలు, 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య, పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నదని వివరించారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించామని పేర్కొన్నారు. వారి సమ్మె వల్ల గర్బిణులు, బాలింతలు , పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళన విరమించాలని మంత్రి ఈ సందర్బంగా కోరారు.