పీసీసీ అధ్య‌క్షుడిపై రోశ‌య్య ప‌రువు న‌ష్టం దావా

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌. ఈయ‌న‌ది కాంగ్రెస్‌తో సుధీర్ఘ అనుబంధం. ఏపీకి రోశ‌య్య‌ను ముఖ్య‌మంత్రిని చేసింది కూడా కాంగ్రెసే. ఆత‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌గా పంపింది యూపీఏ ప్ర‌భుత్వ‌మే. అలాంటి రోశ‌య్య ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడిపైనే ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి వ‌చ్చింది. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రోశ‌య్య‌… ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు ఇలంగోవ‌న్‌పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఇటీవ‌ల ఒక టీవీ చానల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఇలంగోవ‌న్ …గ‌వ‌ర్న‌ర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తమిళనాడులోని యూనివ‌ర్శిటీ […]

Advertisement
Update:2016-05-12 05:44 IST

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌. ఈయ‌న‌ది కాంగ్రెస్‌తో సుధీర్ఘ అనుబంధం. ఏపీకి రోశ‌య్య‌ను ముఖ్య‌మంత్రిని చేసింది కూడా కాంగ్రెసే. ఆత‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌గా పంపింది యూపీఏ ప్ర‌భుత్వ‌మే. అలాంటి రోశ‌య్య ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడిపైనే ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి వ‌చ్చింది.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రోశ‌య్య‌… ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు ఇలంగోవ‌న్‌పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఇటీవ‌ల ఒక టీవీ చానల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఇలంగోవ‌న్ …గ‌వ‌ర్న‌ర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తమిళనాడులోని యూనివ‌ర్శిటీ వీసీల నియామకంలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఒక్కో వైస్ చాన్సలర్ పోస్టుకు పదిహేను కోట్ల రూపాయలు వ‌సూలు చేశార‌ని చెప్పారు. అందులో పది కోట్లు జయలలితకు ఇచ్చి, ఐదు కోట్లు గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారని ఇలంగోవన్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా నొచ్చుకున్న గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య త‌న న్యాయ‌వాది ద్వారా ప‌రువు న‌ష్టం దావా వేయించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News