వైసీపీపై రేవంత్ రెడ్డికి అకాల ప్రేమ
ఈ మధ్య టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉంటున్నాయి. పార్టీ లైన్ కూడా దాటేసి స్వేచ్ఛగా రేవంత్ మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితం కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తూ… ‘ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తేవడంలో కుట్ర చేసింది, ఆ తర్వాత లబ్ధి పొందింది నీ తండ్రి కేసీఆరే” నంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. ”అలా దించేయడం వల్లే అప్పటి […]
ఈ మధ్య టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉంటున్నాయి. పార్టీ లైన్ కూడా దాటేసి స్వేచ్ఛగా రేవంత్ మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితం కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తూ… ‘ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తేవడంలో కుట్ర చేసింది, ఆ తర్వాత లబ్ధి పొందింది నీ తండ్రి కేసీఆరే” నంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. ”అలా దించేయడం వల్లే అప్పటి వరకు మంత్రి కానీ నీ తండ్రికి మంత్రి పదవి వచ్చింది అది నిజమో కాదో వెళ్లి మీ నాన్ననే అడుగు” అంటూ కేటీఆర్ పై రేవంత్ విరుచుకుపడ్డారు. అంటే ఎన్టీఆర్ ను దించేయడం కుట్రలో భాగంగా జరిగిందేనని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ భావిస్తున్నారా అని టీడీపీ నేతలు కంగుతిన్నారు.
అంతేకాదు ”అమరావతికి వెళ్లి చంద్రబాబుతో కలిసి బిర్యానిలు తింటారు. కేసీఆర్ చేసే యాగాలకు ఆప్యాయంగా కలుసుకుంటారు. బతుకమ్మ పండగకు వైఎస్ భారతిని కవితమ్మ పిలుస్తారు. మీరు,మీరు కలిసి రాసుకుపూసుకు తిరుగుతారు. మధ్యలో మమ్మల్ని తెలంగాణ ద్రోహులంటారా” అని నిలదీశారు. ఈ విమర్శ కూడా కేసీఆర్ ను తిడుతున్నట్టుగా లేదు… చంద్రబాబు తీరునే తప్పుపడుతున్నట్టుగా ఉంది.
తాజాగా వైసీపీ మీద కూడా ప్రేమ కురిపించారు రేవంత్. పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్… పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిట్టేందుకు గాను వైసీపీని తల్లిలాంటి పార్టీ అని అన్నారు. కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి తల్లిలాంటి వైసీపీ పార్టీని శ్రీనివాస్ రెడ్డి అమ్ముకున్నారని… వైసీపీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు విని జనం ఆశ్చర్యపోయారు. టీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకుని పొంగులేటిని జగనే పంపించారని ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పుడు హఠాత్తుగా ఇలా ప్లేటు పిరాయించడం చూసి ముక్కున వేలేసుకున్నారు. ఎంతైనా చంద్రబాబు ట్రైనింగ్ కదా అని సరిపెట్టుకున్నారు.
పనిలో పనిగా కేసీఆర్ ఫ్యామిలీపైనా రేవంత్ విమర్శలు చేశారు. ‘నీ అయ్య 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తోక పార్టీ అని గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తుమ్మల కుడి భుజం కావచ్చు గానీ, పాలేరు ప్రజలకు మాత్రం ఎడమ కాలి చెప్పుతో సమానమని అన్నారు.
Click on Image to Read: