సంచలనం... పనామా జాబితాలో హెరిటేజ్ డైరెక్టర్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లకుబేరుల బండారం బట్టబయలు చేస్తున్న పనామా సంచలనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను పనామా బయటపెట్టింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి పేరు కూడా పనామా జాబితాలో చేరింది. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామవరప్రసాద్‌ పేరు పలుమార్లు పనామా జాబితాలో ఉంది. పన్నులు ఎగవేత కంపెనీలతో మోటపర్తి శివరామవరప్రసాద్ సంబంధాలున్నట్టు తేలింది.  పనామా జాబితాలో చంద్రబాబు హెరిటేజ్ డైరెక్టర్ శివరామవరప్రసాద్ ఉండడాన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా […]

Advertisement
Update:2016-05-11 03:51 IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లకుబేరుల బండారం బట్టబయలు చేస్తున్న పనామా సంచలనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను పనామా బయటపెట్టింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి పేరు కూడా పనామా జాబితాలో చేరింది. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న మోటపర్తి శివరామవరప్రసాద్‌ పేరు పలుమార్లు పనామా జాబితాలో ఉంది. పన్నులు ఎగవేత కంపెనీలతో మోటపర్తి శివరామవరప్రసాద్ సంబంధాలున్నట్టు తేలింది.

పనామా జాబితాలో చంద్రబాబు హెరిటేజ్ డైరెక్టర్ శివరామవరప్రసాద్ ఉండడాన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మోటపర్తి శివరామవరప్రసాద్ వివిధ దేశాల్లో భారీగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆఫ్రికాలో పలు కంపెనీలు స్థాపించారు. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమి వెంచర్స్ పేరుతో చాలా కంపెనీలను స్థాపించారు. సిమెంట్ కంపెనీలను ఏర్పాటు చేశారు. బ్రిటీష్ వర్జిన్ ఐస్‌లాండ్, ఘన, పనామాల్లో హెరిటేజ్ డైరెక్టర్‌కు కంపెనీలున్నట్టు పనామా బట్టబయలు చేసింది.

చంద్రబాబు హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న శివరామవరప్రసాద్ మాత్రం … పనామా జాబితాలోని మిగిలిన వ్యక్తుల్లానే తాను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. అంతా చట్టబద్దంగానే సాగిందని వివరించారు. తాను 30 ఏళ్లుగా భారత దేశం వెలుపలే నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. మొత్తం మీద ఈ వ్యవహారం చంద్రబాబుకు ఇబ్బంది పెట్టే పరిణామమే. ఇప్పటికే హెరిటేజ్‌ వ్యాపారంపై అనేక ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా కంపెనీ డైరెక్టర్‌ పనామా జాబితాలో ఉండడం కలకలమే రేపుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News